హీరోయిన్ రష్మిక మందన్నా దేశ వ్యాప్తంగా తక్కువ కాలంలో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. పుష్ప సినిమాతో ప్యాన్ ఇండియా హీరోయిన్ అయిపోయింది. ప్రస్తుతం బాలీవుడ్‌లోనూ వరుస సినిమాలు చేస్తోంది. తాజాగా, తొలి సినిమాలో అవకాశం గురించి మాట్లాడుతూ ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. ఆమెను హీరోయిన్‌గా వెండి తెరకు పరిచయం చేసిన ‘‘పరమవాహ్ స్డూడియోస్’’ ప్రొడక్షన్ హౌస్ గురించి ఆమె మాట్లాడకపోవటంపై విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ వార్త సినిమా సర్కిల్‌లో చక్కర్లు కొడుతోంది. రష్మిక మందన్నను కన్నడ సినిమా పరిశ్రమ బ్యాన్ చేసిందన్న వార్తలు వస్తున్నాయి. డైలీ కల్చర్ చేసిన ట్వీట్ ప్రకారం ..‘‘ కన్నడ సినిమా థియేటర్ల యజమానులు, సినిమా సంస్థలు, సినిమా పరిశ్రమ మొత్తం త్వరలో రష్మిక మందన్నాపై బ్యాన్ విధించబోతోందట.
News from Karnataka that Kannada Theatre Owners, Organizations and Film Industry will soon going to take an action on #RashmikaMandanna !!!
They may go to the extent banning @iamRashmika‘s films permanently from #Karnataka
Worrying thing for #PushpaTheRule and #Varisu Teams
— Daily Culture (@DailyCultureYT) November 24, 2022
ఆమె సినిమాలను కర్ణాటకలో పూర్తిగా బ్యాన్ చేసే అవకాశం ఉందంట. పుష్ప, వారిసు సినిమాలకు ఈ నిర్ణయం ఇబ్బందిగా మారే అవకాశం ఉంది’’ అని పేర్కొంది. ప్రముఖ సినిమా అనలిస్ట్ ఉమైర్ సందు బ్యాన్‌పై తన ట్విటర్ ద్వారా స్పందిస్తూ.. ‘‘ కన్నడ సినిమాలను గౌరవించని కారణంగా రష్మిక మందన్నా కన్నడ సినిమాల నుంచి అధికారికంగా బ్యాన్ చేయబడింది’’ అని పేర్కొన్నారు. రష్మికను కన్నడ సినిమాల్లోంచి బ్యాన్ చేయాలనుకోవటానికి ప్రధానం కారణం ఆమె తాజా ఇంటర్వ్యూ. ఈ ఇంటర్వ్యూలో ఆమె తన తొలి సినిమా అవకాశం గురించి మాట్లాడింది. ‘‘ మొదట నేను ఫ్రెష్ ఫేస్ అనే కాంపిటీషన్‌లో పాల్గొన్నాను. అందులో నేను జాతీయ స్థాయిలో విజేతగా నిలిచాను. ఓ నేషనల్ పేపర్‌లోని ఫస్ట్ పేజీలో నా ఫొటో వచ్చింది. కొన్ని రోజుల తర్వాత ఆ ప్రొడక్షన్ హౌస్ నుంచి ఫోన్ వచ్చింది’’ అని ఆమె అంది.
#RashmikaMandanna officially “ BANNED ” in Kannada Movies due to disrespect Kannada movies !!!
— Umair Sandhu (@UmairSandu) November 24, 2022
అయితే, ఆ ప్రొడక్షన్ హౌస్ పేరు చెప్పటానికి ఆమె ఇష్టపడలేదు. ఆ ప్రొడక్షన్ హౌస్ గురించి మాట్లాడుతున్నపుడు కూడా చేతులు విచిత్రంగా పెట్టింది. ఈ ప్రవర్తనే ఆమెపై విమర్శలకు కారణమైంది. ఆమెకు సినిమా జీవితాన్ని ప్రసాదించిన రక్షిత్ శెట్టి ప్రొడక్షన్ హౌస్ ‘‘పరమవాహ్ స్డూడియోస్’’ పేరు చెప్పటానికి కూడా ఆమె ఇష్టపడలేదు. దీన్ని కన్నడ చిత్ర పరిశ్రమ సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఓ కన్నడ ప్రొడక్షన్ హౌస్ గురించి ఆమె అలా మాట్లాడటం చిత్ర పరిశ్రమను అవమానించినట్లేనని ప్రముఖులు భావిస్తున్నారట. ఈ నేపథ్యంలోనే బ్యాన్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మరి, ఈ వార్తల్లో నిజం ఎంతుందో తెలియాలంటే రష్మిక నుంచి గానీ, కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే.