ఈ మధ్యకాలంలో సినిమాలకంటే సాంగ్స్, లిరిక్స్ పరంగా ఎక్కువగా వివాదాలు జరుగుతున్నాయి. ఇటీవల బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే జంటగా నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘పఠాన్’. యశ్ చోప్రా బ్యానర్ పై ఆదిత్య చోప్రా భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా.. 2023 జనవరి 25న హిందీతో పాటు తెలుగు, తమిళ భాషలలో రిలీజ్ కాబోతుంది. ఇక రిలీజ్ కి ఇంకా ఒక నెలే సమయం ఉండటంతో.. సినిమాలోని ఒక్కో సాంగ్ ని రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలో రీసెంట్ గా షారుఖ్, దీపికా జంటగా ‘బేషరం రంగ్’ అనే రొమాంటిక్ వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. వినడటానికి సాంగ్ బాగానే ఉన్నా.. విజువల్స్ పరంగా సాంగ్ పై వివాదాలు మొదలయ్యాయి.
ఈ సాంగ్ లో షారుఖ్ తన సిక్స్ ప్యాక్ బాడీని చూపిస్తూ కనిపించగా.. దీపికా మాత్రం సాంగ్ మొత్తం టు పీస్ బికినీ ధరించి కనిపించింది. పైగా దీపికా డ్రెస్సింగ్ తో పాటు ఆమె చేసిన డాన్స్ మూమెంట్స్, స్టెప్స్ ప్రేక్షకులకు ఇబ్బంది కలిగించేలా ఉన్నాయి. దీంతో బేషరం రంగ్ సాంగ్ పై పెద్ద ఎత్తున అటు సోషల్ మీడియాలో, ఇటు జనాలలో తీవ్ర వ్యతిరేకత మొదలైంది. సాంగ్ విజువల్స్ చూడటానికి అభ్యంతరకరంగా ఉన్నాయని.. పైగా సాంగ్ లో దీపికా కాషాయ రంగు దుస్తులు ధరించి హిందూ మనోభావాలను దెబ్బతీశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. అంతేగాక బేషరం సాంగ్ చూశాక మధ్యప్రదేశ్ తో పాటు మరికొన్ని ఏరియాలలో పఠాన్ మూవీ రిలీజ్ ఆపేస్తామని నిరసనలు కూడా జరిగాయి.
దీంతో బేషరం రంగ్ సాంగ్ పై వస్తున్న నెగటివిటీ ప్రభావం సినిమాపై పడే అవకాశం ఉందని పఠాన్ నిర్మాత ఆదిత్య చోప్రా కీలక నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉన్నారట. ఇంత నెగిటివిటీ మధ్య సినిమాలో సాంగ్ ఉంటే ప్రాబ్లెమ్ అవుతుందని.. పఠాన్ నుండి బేషరం రంగ్ సాంగ్ తొలగించి రిలీజ్ చేయాలని చూస్తున్నట్లు సమాచారం. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాలంటే మేకర్స్ క్లారిటీ ఇచ్చేవరకు వెయిట్ చేయాలి. ఇక పఠాన్ నుండి ‘ఝుమే జో పఠాన్’ అని సెకండ్ సాంగ్ కూడా రిలీజ్ చేశారు. ఆ సాంగ్ అయితే మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. దాదాపు నాలుగేళ్ళ తర్వాత షారుఖ్ పఠాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేసిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్.. షారుఖ్ కి కంబ్యాక్ హిట్ ఇవ్వనుందేమో చూడాలి. మరి బేషరం రంగ్ సాంగ్.. తెలుగులో ‘నా నిజం రంగు’ అనే టైటిల్ తో రిలీజ్ అయ్యింది. మరి ఈ సాంగ్ సినిమాలో ఉంటే బాగుంటుందా లేదా? మీ అభిప్రాయాలు కామెంట్స్ లో తెలపండి.