చిత్రపరిశ్రమలో సెలబ్రిటీల మధ్య లవ్, ఎఫైర్, రిలేషన్ షిప్స్ అనేవి ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటాయి. కానీ.. ఇటీవల కాలంలో ఇవన్నీ ఎక్కువైపోయాయి. ముఖ్యంగా బాలీవుడ్ లో హీరో హీరోయిన్స్ మధ్య లవ్ ఎఫైర్స్.. పెళ్ళైన స్టార్స్ తో సింగిల్స్ మింగిల్ అవుతున్న న్యూస్.. వయసులో పెద్దవారితో డేటింగ్ అంటూ రకరకాలుగా వార్తల్లో నిలుస్తున్నారు. ఇవన్నీ బాలీవుడ్ లో మామూలే. రీసెంట్ గా మిల్కీ బ్యూటీ తమన్నా కూడా నటుడు విజయ్ వర్మతో ప్రేమాయణం నడుపుతుందంటూ వార్తలు రాగా.. న్యూ ఇయర్ సందర్భంగా ఏకంగా ఫోటోలు, వీడియోలు సైతం బయటికి వచ్చాయి. దీంతో ఇద్దరు లవ్ లో ఉన్నారనే రూమర్స్ మరింత బలపడ్డాయి.
ఇలాంటి తరుణంలో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తనయుడు ఓ నటితో డేటింగ్ లో ఉన్నాడంటూ ఓ వార్త అటు సోషల్ మీడియాలో.. ఇటు సినీ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది. అంతేగాక ఆ నటితో క్లోజ్ గా మూవ్ అయిన ఫోటోలు కూడా బయటికి రావడం గమనార్హం. షారుఖ్ తనయుడు ఆర్యన్ ఖాన్.. పాపులర్ ఐటమ్ సాంగ్స్ హీరోయిన్ నోరా ఫతేహితో లవ్వాయణం నడుపుతున్నాడని టాక్. ప్రస్తుతం ఆర్యన్ వయసు 25 ఏళ్ళు కాగా.. నోరా వయసు 30 ఏళ్ళు. ప్రేమలో వయసుల మధ్య బేధం అనేది అడ్డు కాకపోవచ్చు. కానీ.. ఇప్పటికే ఎన్నో వివాదాల నుండి బయటపడిన ఆర్యన్.. ఇప్పుడు నోరాతో లవ్ లేదా డేటింగ్ లో ఉన్నాడనేది ఎంతవరకు నిజం అనేది హాట్ టాపిక్ గా మారింది.
ఇటీవలే ఆర్యన్ ఖాన్, నోరా ఇద్దరూ కలిసి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ని దుబాయ్ లో జరుపుకున్నట్లు తెలుస్తోంది. అక్కడ వీరిద్దరూ క్లోజ్ గా దిగిన ఫోటోలు కూడా వైరల్ గా మారాయి. అదీగాక షారుఖ్ కూతురు సుహానాతో కూడా నోరా ఓ డిన్నర్ పార్టీలో కనిపించడం జరిగింది. దీంతో ఆర్యన్ – నోరాల మధ్య లవ్ ట్రాక్ నిజంగానే నడుస్తుందనే టాక్ బి టౌన్ లో కోడైకూస్తోంది. ఆర్యన్ ఖాన్ ఇంకా సినిమాల్లోకి రాలేదు. మరోవైపు నోరా కెనడాకు చెందినప్పటికీ, ఐటమ్ సాంగ్స్ చేస్తూ ఇండియాలో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు నోరా బాగా పరిచయం. టెంపర్, బాహుబలి, ఊపిరి, కిక్ 2 లాంటి సినిమాలలో ఐటమ్ సాంగ్స్ చేసి ఆకట్టుకుంది. మరి ఈ తెలుగు ఐటమ్ హీరోయిన్ తో షారుఖ్ తనయుడి లవ్ అనే వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.