రాఖీ సావంత్.. గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సినిమాల కన్నా కూడా వివాదాలు, గ్లామర్ రోల్స్, ఎక్స్‌పోజింగ్ వంటి వాటితో.. పాపులర్ అయ్యింది రాఖీ సావంత్. బిగ్‌బాస్ హౌస్‌లో కూడా సందడి చేసింది. ఇక రాఖీ సావంత్ అంటే వివాదాలకు పెట్టింది పేరు. తరచుగా ఏదో ఒక విషయానికి సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలవడం రాఖి సావంత్‌కు అలవాటు. పైగా ఎలాంటి విషయం గురించి అయినా సరే.. కుండబద్దలు కొట్టినట్లుగా మాట్లాడటం రాఖీ నైజం. వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు కూడా వివాదాస్పదంగానే ఉంటాయి. ఇక రాఖీ సావంత్.. గత ఏడాది తన మొదటి భర్త నుంచి విడిపోయిన సంగతి తెలిసిందే. రాఖి సావంత్ మొదటి భర్త పేరు రితేష్. అతడు తనను దారుణంగా హింసిస్తున్నాడని.. వేధింపులు తట్టుకోలేకనే.. తనకి విడాకులు ఇచ్చినట్లు తెలిపింది రాఖీ సావంత్. ఆ తర్వాత కొన్నాళ్లకు ఆదిల్ దురాని అనే వ్యాపారవేత్తతో ప్రేమలో పడింది రాఖీ సావంత్. గత ఏడాది వీరిద్దరికి నిశ్చితార్థం జరిగినట్లు కూడా వార్తలు వచ్చాయి.
అయితే తాజాగా మరో షాకింగ్ వార్త వెలుగులోకి వచ్చింది. రాఖీ, ఆదిల్ ఇద్దరు వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. రాఖీ సావంత్, ఆదిల్ కోర్టులో వివాహం చేసుకుని ఒక్కటైనట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించి ఫోటోలు వైరల్ అవుతున్నాయి. గత ఏడాదే వీరిద్దరి వివాహం జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక వీరిద్దరికి సంబంధించి ఒక ఫోటో కూడా వైరలవుతోంది. దీనిలో ఆదిల్, రాఖీ ఇద్దరూ పూలదండలతో కనిపిస్తున్నారు. చేతిలో తమ మ్యారేజ్ సర్టిఫికెట్ పట్టుకుని ఉన్నారు. అంతేకాక.. వీరిద్దరూ..ఇద్దరూ మ్యారేజ్ సర్టిఫికెట్‌లో సంతకాలు చేస్తున్న ఫోటో కూడా వైరల్ అవుతోంది. దీనితో రాఖీ సావంత్ మరోసారి వివాహం చేసుకుందా.. అది కూడా సీక్రెట్‌గా అంటూ నెటిజనులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
వీటిన్నటింకి మించి మరో పెద్ద ట్విస్ట్ ఎంటంటే.. తనకు, రాఖీ సావంత్‌కి అసలు ఇంకా వివాహం జరగలేదంటున్నాడు ఆదిల్. అయితే ఆదిల్ కుటుంబం ఇంకా తనను యాక్సెప్ట్ చేయలేదని.. గతంలో చెప్పుకొచ్చింది రాఖీ. దీంతో అసలు ఆదిల్ కుటుంబం రాఖీని అంగీకరించిందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వైరల్ అవుతున్న రాఖీ పెళ్లి ఫోటోలపై వీరిద్దరూ ఎలా స్పందిస్తారో చూడాలి. ఇక ఆదిల్, రాఖీ ఇద్దరూ జంటగా పలు సందర్భాల్లో మీడియా ముందు కనిపించారు. అలానే అలియా భట్‌కి కూతురు పుట్టినప్పుడు కూడా రాఖీ, ఆదిల్ జంటగా విష్ చేశారు. మరి ఈ పెళ్లి వార్తలపై రాఖీ ఎలా స్పందిస్తుందో చూడాలి. మరి నిజంగానే రాఖీ సీక్రెట్‌గా వివాహం చేసుకుందని మీరు భావిస్తున్నారా.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
मतलब शादी करने से पहले धर्म परिवर्तन कराया गया। 🤦
फ़िल्म अभनेत्री #Rakhi__Sawant और आदिल ख़ान दुर्रानी के निकाह से पहले…. 👇 pic.twitter.com/pRkdIEpELw— MD Nasrullah (@MD_Nasrullah_01) January 11, 2023