ఎక్స్ ట్రా జబర్దస్త్ కామెడీ షోతో కెరీర్ ప్రారంభించిన ఇమ్మాన్యుయేల్.. అతి తక్కువ కాలంలోనే ఎంతో మంచి గుర్తింపు సంపాదించాడు. ఒక్క ఎక్స్ ట్రా జబర్దస్త్ లోనే కాకుండా.. జాతిరత్నాలు, స్పెషల్ ఈవెంట్స్ అన్నింటిలో ఇమ్మాన్యుయేల్ అలరిస్తుంటాడు. అంతే కాకుండా వర్షతో ఇమ్మూకి పెట్టిన లవ్ ట్రాక్ బాగా వర్కౌట్ అయ్యింది. ఆ లవ్ ట్రాక్ ఇమ్మాన్యుయేల్ కు కూడా బాగా ఫేమ్ తెచ్చిపెట్టిందనే చెప్పాలి. ఫైమాతో కామెడీ ట్రాక్ కూడా ఇమ్మాన్యుయేల్ కు బాగా కలిసొచ్చిన అంశం. తాజాగా బుల్లెట్ భాస్కర్-ఇమ్మాన్యుయేల్-వర్ష-ఫైమా మధ్య కామెడీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తాజాగా బుల్లెట్ భాస్కర్ టీమ్ సర్కారు వారి పాట సినిమా స్పూఫ్ చేశారు. అందులో బుల్లెట్ భాస్కర్ మహేశ్ క్యారెక్టర్ చేయగా.. వర్ష కళావతి పాత్ర చేస్తుంది. భాస్కర్ దగ్గర రూ.10 లక్షలు అప్పు తీసుకున్న వర్ష వాటితో ఇమ్మాన్యుయేల్ ని పెళ్లి చేసుకుంటుంది. బుల్లెట్ భాస్కర్ భార్య ఫైమా ఇచ్చిన పది లక్షలు కావాల్సిందే అని గొడవ చేయగా వర్షను అడగడానికి వెళ్లి ఆమె పెళ్లి చేసుకున్న విషయం తెలుసుకుంటాడు.
వాళ్ల మొదటి రాత్రి జరగకుండా అడ్డుకుని.. డబ్బు కట్టలేదని వర్షను ఇంట్లో పనులు చేసేందుకు తీసుకొస్తాడు. అందుకు ఇమ్మూ కూడా ఆమె వెనకాలే వస్తాడు. వారి మధ్య మాటల సందర్భంలో ఇమ్మాన్యూయేల్- బుల్లెట్ భాస్కర్ ను కొట్టాల్సి ఉంటుంది. అయితే స్కిట్ లో ఇన్వాల్వ్ అయిపోయిన ఇమ్మూ.. నిజంగానే భాస్కర్ లాగిపెట్టి కొట్టేస్తాడు. తర్వాత అన్నా సారీ అంటూ పట్టుకుని.. స్కిట్ ని ఆపకుండా కంటిన్యూ చేస్తారు. జడ్జెస్ కూడా ఇమ్మాన్యుయేల్ కొట్టడం చూసి షాకవుతారు. భాస్కర్ ని ఇమ్మాన్యుయేల్ కొట్టడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.