తాజాగా ఇళయరాజా సంగీతం అందిస్తున్న చిత్రం 'విడుదలై'. ఈ సినిమాకు సంబంధించిన ఆడియో రిలీజ్ ఫంక్షన్ చెన్నైలో జరిగింది. ఈ వేడుకలో స్టార్ డైరెక్టర్ పై పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు మ్యూజిక్ మాస్ట్రో.
తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాక.. యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో పరిచయం అక్కర్లేని పేరు మాస్ట్రో ఇళయరాజా. తన సంగీతంతో అభిమానులను ఓలలాడిస్తున్నారు. వయసు పెరుగుతున్నా గానీ తనలో ఉన్న సంగీత దర్శకుడిని కొత్తగా పరిచయం చేస్తున్నారాయన. ఎప్పటికప్పుడు తనలో ఉన్న కళాకారుడిని కొత్తగా ప్రజెంట్ చేయాలని చూస్తుంటారు మ్యూజిక్ మాస్ట్రో. ఇక తాజాగా ఇళయరాజా సంగీతం అందిస్తున్న చిత్రం ‘విడుదలై’. ఈ సినిమాకు సంబంధించిన ఆడియో రిలీజ్ ఫంక్షన్ తాజాగా చెన్నైలో జరిగింది. ఈ వేడుకలో స్టార్ డైరెక్టర్ పై పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు మ్యూజిక్ మాస్ట్రో.
‘విడుదలై’ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు దిగ్గజ సంగీత దర్శకులు ఇళయరాజా. దాంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. తాజాగా విడుదలై మూవీకి సంబంధించిన ఆడియో ఫంక్షన్ ను చైన్నెలో నిర్వహించారు. ఈ వేడుకలో ఇళయరాజా మాట్లాడుతూ..”వెట్రిమారన్ ఓ గొప్ప దర్శకుడు. ఇక ఈ సినిమా మీరు ఇప్పటి వరకు చూడని కాలంలో జరుగుతుంది. ఇతడు చెప్పే ఒక్కో కథ.. ఒక్కో ఆణిముత్యంలా ఉంటుంది. ఇక ఈ సినిమాలో నా నుంచి మీరు ఇప్పటి వరకు వినని సంగీతాన్ని ఈ చిత్రంలో వింటారు” అని ఇళయరాజా చెప్పుకొచ్చారు.
అనంతరం డైరెక్టర్ వెట్రిమారన్ మాట్లాడుతూ..”నేను ముందుగా 45 నిమిషాల సినిమాను తీసి ఇళయరాజాకు చూపించాను. అసలు ఈ సినిమా ప్రారంభానికి ఆయనే ముఖ్య కారణం. ఆయన పాటే సినిమాను ముందుకు తీసుకెళ్తుంది. ఈ మూవీలోని నేపథ్య సంగీతం వినగానే ఓ విధమైన అనుభూతికి లోనైయ్యాను” అని చెప్పుకొచ్చాడు వెట్రిమారన్. ఇక విడుదలై సినిమా ద్వారా కమెడియన్ సూరి హీరోగా పరిచయం అవుతున్నాడు. ఈ కార్యక్రమానికి విలక్షణ నటుడు విజయ్ సేతుపతి,నిర్మాత కలైపులి థాను హాజరైయ్యారు. విజయ్ సేతుపతి ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు.