హీరోయిన్ హనీరోజ్.. ప్రస్తుతం తెలుగు సినిమా ప్రేక్షకులు ఈ పేరును బాగా స్మరిస్తున్నారు. బాలకృష్ణ- గోపీచంద్ మలినేని కాంబోలో వచ్చిన వీర సింహారెడ్డి సినిమాలో ఈ మలయాళ బ్యూటీ హనీరోజ్ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. స్క్రీన్ పై ఆమె నటన, అందం, అభినయానికి తెలుగు ప్రేక్షకులు మెస్మరైజ్ అయిపోయారు. జనవరి 12 నుంచి హనీరోజ్ అటు తెలుగు రాష్ట్రాలు, ఇటు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పుడు ఆమెకు సంబంధించి ఇంకో కిక్కిచ్చే వార్త ఒకటి చక్కర్లు కొడుతోంది.
వీరసింహారెడ్డి సినిమాలోనే కాదు.. సక్సెస్ మీట్ లో కూడా హనీరోజ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రేక్షకులు ఆమెను చూసి తెగ మురిసిపోతున్నారు. ఇప్పుడు అంతకు మించిన క్రేజీ గాసిప్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే మరోసారి హనీరోజ్- నందమూరి నటసింహంతో జత కట్టనున్నట్లు చెబుతున్నారు. అవును బాలయ్య- అనీల్ రావిపూడి కాంబోలో రాబోతున్న సినిమాలో.. హీరోయిన్ గా హనీరోజ్ ని డిసైడ్ అయ్యారంటూ టాలీవుడ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. అయితే దీనిపై ఎలాంటి అధికారక ప్రకటన రాలేదు. ప్రస్తుతం ఆమెకు ఉన్న క్రేజ్ కి అది నిజమైనా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెబుతున్నారు.
ఎందుకంటే ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో హనీరోజ్ కు క్రేజ్ బాగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే ఈ గాసిప్ కి ప్రాధాన్యం లభించింది. పైగా వీర సింహారెడ్డి సక్సెస్ మీట్ లో అనీల్ రావిపూడిగా సందడి చేయడంతో ఈ వార్తకు మరింత బలం చేకూరినట్లు అయ్యింది. అది నిజం కాకపోయిన ఆమెనే హీరోయిన్ గా తీసుకోవాలంటూ కొందరు డిమాండ్లు కూడా మొదలెట్టినట్లు తెలుస్తోంది. మరి.. బాలకృష్ణ అభిమానులు ఇదే విషయంలో పట్టుబడితే అనీల్ రావిపూడి ఆమెను నిజంగానే హీరోయిన్ గా సెలక్ట్ చేసినా ఆశ్చర్యం ఉండదని చెబుతున్నారు.
ఇంక వీర సింహారెడ్డి సినిమా విషయానికి వస్తే.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. అఖండతో భారీ విజయం అందుకున్న బాలయ్యకు ఈ సినిమా కూడా ఇంచుమించు అలాంటి సక్సెస్ నే అందించింది. నిజానికి ఈ మూవీ మిక్స్ డ్ టాక్ సొంతం చేసుకున్నా కూడా వసూళ్లలో మాత్రం దూసుకుపోయింది. సంక్రాంతి బరిలో దిగిన వీర సింహారెడ్డి ప్రస్తుతం లాభాల్లో నడుస్తోంది. ఈ సక్సెస్ లో మరింత జోష్ పెంచేందుకు చిత్రబృందం ఆదివారం సక్సెస్ మీట్ కూడా నిర్వహించింది. సిద్ధూ జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ తో కలిసి బాలయ్య తనదైన ఎనర్జీతో సందడి చేశారు. బాలయ్య- హనీరోజ్ మరోసారి కలిసి నటించాలని కోరుకుంటున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.