తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకతను మూటగట్టుకున్న హీరోయిన్ తమన్నా. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీడేస్ చిత్రం నుంచి ఈ అమ్మడు ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. అప్పటి నుంచి మెల్ల మెల్లగా స్టార్ హీరోలందరితోనూ నటిస్తూ స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది. అలా తన అందం, అభినయంతో మిల్కీ బ్యూటీ తమన్నా మంచి మార్కులే కొట్టేసింది.
ఇదిలా ఉంటే తమన్నా నటించిన చిత్రం తాజా చిత్రం బబ్జీ బౌన్సర్. మధుర్ బండార్కర్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ ఈ నెల 23న డిస్నీ హాట్ స్టార్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఈ సందర్భంగా మాట్లాడిన ఈ ముద్దుగుమ్మ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఈ సినిమా ద్వారా నేను ఎన్నో కొత్త విషయాలను నేర్చుకున్నానని తెలిపింది. డైరెక్టర్ మధుర్ బండార్కర్ సినిమాల్లో నటించిన ప్రతీ ఒక్కరికి అవార్డులు వచ్చాయని, ఈ మూవీతో నాకు కూడా అవార్డు వస్తుందనే బలమైన విశ్వాసంతో ఉన్నానని తమన్నా ఆశాభావం వ్యక్తం చేసింది.
ఇక ఇదే కాకుండా తన పెళ్లి వార్తలపై కూడా తమ్మన్నా నోరు విప్పింది. ఇప్పటి వరకు పెళ్లి చేసుకోవాలంటూ నన్ను ఎవరూ ఇబ్బంది పెట్టిన దాఖలాలు లేవని, ఒకవేళ ఆ టైమ్ వస్తే గనుక ఖచ్చితంగా మా ఫ్యామిలీ వాళ్లకి చెప్పి సంతోషంగా పెళ్లి చేసుకుంటానని ఆమె తెలిపింది. దీంతో ఎప్పటి నుంచో వస్తున్న తన పెళ్లి వార్తలపై తమన్నా ఎట్టకేలకు ఫుల్ స్టాప్ పెట్టింది. తన పెళ్లెప్పుడో చెప్పిన మిల్కీ బ్యూటీ తమన్నా కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.