ప్రస్తుతం టాలీవుడ్ లో గట్టిగా వినిపిస్తున్న పేరు హీరోయిన్ శ్రీలీల. మాస్ మహారాజా ‘ధమాకా’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించనున్న ఈ బ్యూటీ.. ప్రమోషన్స్ లోనూ యమ యాక్టివ్ గా కనిపించింది. అందరితోనూ ఇంటరాక్ట్ అవుతూ, చలాకీగా ఉంటూ రిలీజ్ కు ముందే యూత్ మనసులు దోచుకుంటోంది. ప్రస్తుతం ఈమె చేతిలో అర డజనుకు పైగా మూవీస్ ఉన్నాయి. అవన్నీ కూడా వచ్చే ఏడాది వరసపెట్టి థియేటర్లలోకి రానుంది. ఇందులో ఏ కొన్ని హిట్ అయినా సరే శ్రీలీల, స్టార్ హీరోయిన్ అయిపోవడం గ్యారంటీ. అలాంటి ఈ యంగ్ బ్యూటీ.. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఇవి తెలుగు చిత్రసీమలో చర్చనీయాంశంగా మారాయి.
ఇక విషయానికొస్తే.. అమెరికాలో పుట్టిన శ్రీలీల, బెంగళూరులో పెరిగింది. తల్లి గైనకాలిజిస్ట్. ఇక చిన్నప్పుడే భరతనాట్యం నేర్చుకున్న ఈమె.. డాక్టర్ కావాలనుకుంటోంది. ఈ మధ్య ఎగ్జామ్స్ పూర్తి చేసి, ‘ధమాకా’ ప్రమోషన్స్ కు అటెండ్ అవుతోంది. టాలీవుడ్ కుర్రాళ్లకు గిలిగింతలు పెడుతున్న శ్రీలీల.. దర్శకుడి చేతుల మీదుగా ‘పెళ్లి సందD’సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రం ఫలితం ఎలా ఉన్నాసరే ఈమెకు మాత్రం పుల్ మార్క్స్ పడ్డాయి. ఇక ఇంటర్వ్యూలో భాగంగా రవితేజ గురించి ఈ అమ్మడు చేసిన వ్యాఖ్యలు.. మాస్ మహారాజా ఫ్యాన్స్ కి ఫుల్ ఆనందాన్నిస్తున్నాయి. అదే టైంలో శ్రీలీల చేసిన మిగతా కామెంట్స్ కాస్త చర్చనీయాంశంగా మారాయి.
‘రవితేజతో నటించడం చాలా సంతోషంగా ఉంది. ఆయన ఎనర్జీ మ్యాచ్ చేయడం ఎవరి వల్ల కాదు.’ అని శ్రీలీల చెప్పింది. అలానే రవితేజ లాంటి సీనియర్ హీరోలతో యాక్ట్ చేయడం, ఏజ్ గ్యాప్ గురించి శ్రీలీలను అడగ్గా.. ‘నా కన్నా ముందు స్టార్ హీరోయిన్లే తమకన్న ఎక్కువ వయసున్న హీరోలతో కలిసి నటించారు వారి ఏజ్ గురించి పట్టించుకోలేదు. ఇక నేనేంత చెప్పండి’ అని శ్రీలీల చెప్పింది. ఈ బ్యూటీ చాలా నార్మల్ గానే ఈ విషయం చెప్పినప్పటికీ.. అడిగిన వాళ్లకు స్ట్రాంగ్ కౌంటర్ లా అనిపించొచ్చు. ఇదిలా ఉండగా యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తున్న ‘అనగనగా ఒక రాజు’, తెలుగు-కన్నడ ద్విభాషా చిత్రం ‘జూనియర్’లోనూ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. మరి శ్రీలీల స్టార్ హీరోయిన్లపై చేసిన వ్యాఖ్యలు మీకెలా అనిపించాయి. కింద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.