పైన ఫొటోలో కనిపిస్తున్న పాప ప్రముఖ హీరోయిన్. హైదరాబాద్ లో పుట్టి పెరిగిన ఈమెకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఏ ఔట్ ఫిట్ అయినా సరే ఈమెని కొట్టేవారు లేరు. మరి ఈ బ్యూటీ ఎవరో కనుగొన్నారా?
ఆమె అచ్చమైన తెలుగమ్మాయి. చిన్నప్పుడు బాగా చదువుకుంది. కానీ ఇంజినీరింగ్ చేసిన తర్వాత చాలామందిలా జాబ్ కాకుండా గ్లామర్ సైడ్ వచ్చింది. మిస్ హైదరాబాద్ రన్నరప్ గా నిలిచింది. అలా షార్ట్ ఫిల్మ్స్ లో హీరోయిన్ గా నటించింది. పలు సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ చేస్తూ గుర్తింపు తెచ్చుకుంది. అయితే చాలా తక్కువ బడ్జెట్ తో తీసిన ఓ సినిమా సూపర్ హిట్ అయింది. హీరో-డైరెక్టర్ కు మాత్రమే కాదు ఈమెకు కూడా ఎక్కడలేని పేరు తీసుకొచ్చింది. చెప్పాలంటే దేశం మొత్తం తెలిసే స్టార్ ని చేసేసింది. మరి ఆమె ఎవరో గుర్తుపట్టారా? లేదా చెప్పేయమంటారా?
ఇక వివరాల్లోకి వెళ్తే.. పైన ఫొటోలో చాలా క్యూట్ గా కనిపిస్తూ పోజులిచ్చిన పాప రీతూవర్మ. ‘పెళ్లి చూపులు’ మూవీతో ఓవర్ నైట్ సెన్సేషన్ గా మారిపోయిన ఈ భామ.. పుట్టి పెరిగింది అంతా హైదరాబాద్ లోనే. అయితే తండ్రిది మధ్య ప్రదేశ్ కాబట్టి ఇంట్లో హిందీలో మాట్లాడుకున్న తెలుగులోనూ చాలా ఫ్లూయెంట్ గా మాట్లాడగలదు. సొంతంగా డబ్బింగ్ కూడా చెప్పుకుంటుంది. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళంలోనూ హీరోయిన్ గా చేస్తున్న రీతూవర్మ.. సినిమాలు చేసే విషయంలో మిగతా హీరోయిన్లతో పోలిస్తే చాలా స్పెషల్.
ఎందుకంటే హీరోయిన్లకు యాక్టింగ్ తోపాటు గ్లామర్ కూడా ఉండాలి. అయితే ఇప్పుడు చాలామంది భామలు నటన కంటే మిగతా వాటిని చూపించి తెగ ఎంటర్ టైన్ చేస్తుంటారు. కానీ రీతూవర్మ మాత్రం పద్ధతిగా చీరకట్టులోనే నిండుగా ఫొటోలకు పోజులిస్తూ ఉంటుంది. అలా అని మోడ్రన్ డ్రస్సులో బాగుండదా అంటే అలా అస్సలు కాదు. చీర లేదా మోడ్రన్ ఔట్ ఫిట్ ఏదైనా సరే రీతూని కొట్టే బ్యూటీ లేదని చెప్పాలి. ఇక తాజాగా ఆమె పుట్టినరోజు సందర్భంగా చిన్నప్పటి ఫొటో ఒకటి వైరల్ గా మారింది. మరి రీతూవర్మని చిన్నప్పటి ఫొటోలో మీలో ఎంతమంది గుర్తుపట్టారు? కింద కామెంట్ చేయండి.