రెజీనా.. నిన్న మొన్నటి వరకు తెలుగులో బిజీ హీరోయిన్. “శివ మనసులో శృతి మూవీ”తో ఈ అమ్మడు టాలీవుడ్ లో అడుగు పెట్టింది. ఇన్నేళ్ల కాలంలో రెజీనా తెలుగులో చేసింది తక్కువ సినిమాల్లోనే అయినా.., స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక మార్క్ సెట్ చేసుకోగలిగింది. అయితే.., తెలుగునాట కొత్త అందాల తాకిడి ఎక్కువ కావడంతో ఈ అమ్మడికి అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలోనే రెజీనా మిగతా భాషల్లో బిజీ అయ్యే ప్రయత్నాల్లో ఉంది. అయితే.., ఇప్పుడు ఒక్కసారిగా ఈ అమ్మడు వార్తల్లో నిలవడం విశేషం. ఇప్పుడు రెజీనా పై నెటిజన్స్ ఓ స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఈ విమర్శలు అన్నింటికి ఒకే ఒక్క ఫోటో కారణం కావడం విశేషం.
మిగతా స్టార్ హీరోయిన్స్ లానే రెజీనా కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటుంది. ఇక.. తన సోషల్ మీడియా ఖాతాలో కమర్షియల్ పోస్ట్ లు చేస్తూ ఈ అమ్మడు బాగానే సంపాదిస్తోంది. ఇందులో భాగంగానే రెజీనా తాజాగా ఓ మద్యం కంపెనీ బాటిల్ ఫోటోను షేర్ చేసింది.
ఈ ఫోటోకి.. “ప్రయాణం ఎప్పటికీ పదిలంగా ఉంటుందని, ఈ మధురక్షణాలను మద్యంతో సెలబ్రేట్ చేసుకుంటానని రాసుకొచ్చింది”. దాంతో ఈ ఫోటో పై నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. హీరోయిన్ హోదాలో ఉండి ఇలాంటి యాడ్స్ చేస్తావా అని కొందరు ఆమెను అన్ ఫాలో చేస్తున్నారు. మరి.. రెజీనాని నెటిజన్స్ ట్రోల్స్ చేయడం ఎంత వరకు కరెక్ట్? ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.
