హీరోయిన్లు అనగానే ప్రేక్షకులు దాదాపుగా వాళ్ల గ్లామర్ సైడ్ మాత్రమే చూస్తారు. కానీ సదరు బ్యూటీస్ కి కూడా పర్సనల్ లైఫ్ ఉంటుంది. వాళ్లు చిన్నప్పుడు చేసిన అల్లరి, తీసుకున్న ఫొటోలు అప్పుడప్పుడు బయటకొస్తుంటాయి. వాటిని చూసినప్పుడు.. అరే భలే ముద్దుగా ఉన్నారు కదా అని అభిమానులకు కచ్చితంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడంటే హీరోయిన్, యాక్టింగ్ అని బిజీబిజీగా ఉంటారు. చిన్నప్పుడు మాత్రం అలాంటి హడావుడి ఏం లేకుండా మనస్ఫూర్తిగా నవ్వుతూ ఫొటోలు తీసుకుని ఉంటారు. అలా ప్రస్తుతం ఓ హీరోయిన్ చైల్డ్ హుడ్ పిక్ వైరల్ గా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. పైన ఫొటోలో కనిపిస్తున్న చిన్నారి రెజీనా కసాండ్రా. చెన్నైలో డిసెంబరు 13న పుట్టిన ఈ భామ.. ఓవైపు చదువుతూనే డీడీ ఛానెల్స్ లో బాలనటిగా ప్రోగ్రామ్స్ చేసింది. సెలవుల్లో యాక్టింగ్ క్లాసులకు వెళ్లిన రెజీనా.. భరతనాట్యంలోనూ ట్రైనింగ్ తీసుకుంది. టీవీ షోలు చేస్తూ, సెట్ లో దొరికిన ఖాళీ టైంలో చదువుకునేది. ఇక 11 ఏళ్ల వయసులో ఓ అబ్బాయి కోసం కరాటే క్లాసులో కూడా జాయిన్ అయింది. అది ఎక్కువ కాలం నిలవలేదు. ఇక 14 ఏళ్ల వయసులోనే రెండు వారాలు స్కూల్ కు సెలవుపెట్టి ఓ సినిమా చేసింది. కానీ అది బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అయింది. ఇక 15వ ఏటా.. 21 ఏళ్ల ప్రెగ్నెంట్ పాత్ర చేసింది.
‘కండ నాళ్ ముదల్’ పేరుతో తీసిన ఈ తమిళ సినిమా.. బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక 2012లో ‘శివ మనసులో శృతి’ మూవీతో తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇక అప్పటినుంచి తెలుగుతోపాటు తమిళంలోనూ హీరోయిన్ గా చేస్తూ గుర్తింపు తెచ్చుకుంది. ఇండస్ట్రీలోనే సాయిధరమ్ తేజ్, సందీప్ కిషన్ తో ఈమె రిలేషన్ షిప్ మెంటైన్ చేసినట్లు రూమర్స్ వచ్చాయి. 2016లో విక్రమ్ ఆదిత్య మేనన్ అనే వ్యక్తితో రిలేషన్ లో ఉన్నానని చెబుతూ ఓ పోస్ట్ పెట్టింది. కానీ అది పెళ్లి వరకు వెళ్లినట్లు లేదు. ఆ తర్వాత కాలంలో రెజీనా.. ఆ ఫొటో కూడా డిలీట్ చేసింది. ఇక ఈ ఏడాది థియేటర్లలోకి వచ్చిన ‘ఆచార్య’లో స్పెషల్ సాంగ్ కూడా చేసి ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేసింది. ప్రస్తుతం తెలుగు, తమిళంలో అరడజనుకుపైగా చిత్రాలు చేస్తూ బిజీగా ఉంది. మరి రెజీనా చిత్రాల్లో మీకే ఏదంటే ఇష్టం… దిగువన కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని చెప్పండి.