హీరోయిన్ నిధి అగర్వాల్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు. హిందీలో కెరీర్ ప్రారంభించినప్పటికీ.. ప్రస్తుతం సౌత్ లో సెటిలైపోయింది. తెలుగు, తమిళంలో మూవీస్ చేస్తూ బిజీగా ఉంది. అయితే నిధి యాక్టింగ్ గురించి పక్కనబెడితే గ్లామర్ తో నెట్టుకొచ్చేస్తుంది అనే కామెంట్ కూడా అప్పుడప్పుడు వినిపిస్తుంది. ఏదేమైనప్పటికీ.. ప్రముఖ హీరోలతో కలిసి సినిమాలు చేస్తూ వస్తోంది. అయితే తాజాగా ఆమెపై ఓ ప్రముఖ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. అదే విషయాన్ని నిధినే స్వయంగా బయటపెట్టింది. ఆయన అలా అనేసరికి షాక్ అయ్యానని కూడా చెప్పింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ లో పుట్టిన నిధి అగర్వాల్, బెంగళూరులో పెరిగింది. ఇక మోడలింగ్ లోకి అడుగుపెట్టిన ఆమె.. క్లాసికల్ డ్యాన్సులు కూడా నేర్చుకుంది. అలా హిందీలో ‘మున్నా మైకేల్’ సినిమతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగులో నాగచైతన్య ‘సవ్యసాచి’తో కథానాయికగా పరిచయమైంది. 2019లో ‘ఇస్మార్ట్ శంకర్’తో హిట్ కొట్టింది గానీ ఆమెకి పెద్దగా అవకాశాలైతే రాలేదు. ప్రస్తుతం నిధి చేస్తున్న ఒకే ఒక్క తెలుగు సినిమా పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’. టాలీవుడ్ గురించి పక్కనబెడితే తమిళంలో మాత్రం పలు సినిమాలు చేస్తోంది.
శింబు ‘ఈశ్వరన్’తో తమిళంలోకి అడుగుపెట్టిన నిధి.. హిట్ కొట్టలేకపోయింది. కానీ శింబుతో ఆమెకు పెళ్లి జరగనుందనే రూమర్ మాత్రం గట్టిగా వినిపించింది. దీని గురించి పక్కనబెడితే గతేడాది జయం రవి ‘భూమి’తో ప్రేక్షకుల్ని పలకరించింది. తాజాగా ఉదయనిధి స్టాలిన్ తో నిధి అగర్వాల్ కలిసి నటించిన ‘కలగ తలవైన్’ రిలీజైంది. ఇకపోతే ఈ సినిమాలో యాక్ట్ చేయడం అదృష్టంగా భావిస్తున్నానని నిధి చెప్పింది. ఓసారి ఈ సినిమా డైరెక్టర్ మగిళ్ తిరుమేణి నుంచి ఫోన్ రాగా, ఆయన్ని కలిసేందుకు వెళ్లానని చెప్పింది. తనని చూసిన వెంటనే.. ముందు ముఖం క్లీన్ చేసుకుని రమ్మన్నారని చెప్పింది. ఈ చిత్రంలో మేకప్ లేకుండానే నటించాలని ఆయన చెప్పారని, అందుకే ఆయన అలా అన్నారని నిధి పేర్కొంది. తమిళ చిత్రాల్లో యాక్ట్ చేస్తున్నప్పటి నుంచి తమిళ్ నేర్చుకుంటున్నానని నిధి అగర్వాల్ తెలిపింది. మరి నిధి అగర్వాల్ పై డైరెక్టర్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.