ఆమె యాక్టింగ్ కి మాత్రమే కాదు నడుముకి కూడా లక్షలాది మంది ఫ్యాన్స్ ఉన్నారు. క్రేజ్ అలాంటిది మరి. మహేష్, ప్రభాస్, పవన్ కల్యాణ్ లాంటి స్టార్ హీరోలతో యాక్ట్ చేసి హిట్స్ కొట్టింది.
ఆమె ఓ సాధారణ హీరోయిన్. ఫస్ట్ సినిమాతోనే అద్భుతమైన సక్సెస్ అందుకుంది. రెండో సినిమాతో ఏకంగా ఇండస్ట్రీ హిట్ కొట్టింది. ఆ తర్వాత.. చాలామంది స్టార్ హీరోలతో వరసపెట్టి మూవీస్ చేసింది. టాలీవుడ్ లో 12 ఏళ్ల పాటు హీరోయిన్ గా తనదైన మార్క్ క్రియేట్ చేసింది. తెలుగుతో పాటు తమిళ, హిందీలోనూ సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ.. ఇప్పుడు ఓ హీరోయిన్ తమ్ముడితో రిలేషన్ లో ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. ఇదంతా కాదు ఆమె నడుముకే లక్షలాది మంది ఫ్యాన్స్ ఉన్నారంటే మీరు నమ్ముతారా? కచ్చితంగా అవాక్కవుతారు. మరి ఇంతలా చెబుతున్నాం కదా.. ఆమె ఎవరో కనిపెట్టారా? చెప్పేయమంటారా?
ఇక వివరాల్లోకి వెళ్తే.. పైన ఫొటోలో కనిపిస్తున్న ముద్దుగుమ్మ ముంబయిలో పుట్టింది. ఈమెకి పదేళ్లు ఉన్నప్పుడు.. ఫ్యామిలీ మొత్తం గోవాకి షిప్ట్ అయిపోయారు. అలా ఓవైపు చదువుతూనే మరోవైపు మోడలింగ్ లోకి అడుగుపెట్టింది. 16 ఏళ్ల వయసులోనే తొలిసారి మోడల్ గా ఛాన్సుల కోసం ప్రయత్నించింది. అలా పలు యాడ్స్ లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె పేరే ఇలియానా. తెలుగులో ‘దేవదాస్’ మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అద్భుతమైన సక్సెస్ అందుకుంది. ఆ వెంటనే మహేష్ ‘పోకిరి’లో నటించి ఏకంగా ఇండస్ట్రీ హిట్ కొట్టేసింది. నడుముతో తెలుగు రాష్ట్రాల్ని ఊపు ఊపేసింది.
ఈ బ్యూటీ పేరు చెప్పగానే అందరికీ ‘జీరో సైజ్’ నడుమునే గుర్తొస్తుంది. ‘పోకిరి’ మాత్రమే కాదు చాలా సినిమాల్లో ఇలియానా.. ఆ నడుముతో వయ్యారంగా నడుస్తుంటే కుర్రాళ్లు పడిచచ్చిపోయేవారు. ఈమెని చూసేందుకు మళ్లీ మళ్లీ థియేటర్ కి వెళ్లేవారు. చివరగా 2018లో ‘అమర్ అక్బర్ ఆంటోని’లో కనిపించిన ఈ బ్యూటీ.. అది ఫ్లాప్ కావడంతో టాలీవుడ్ కి పూర్తిగా దూరమైపోయింది. 2014 తర్వాత భారతీయ పౌరసత్వం వదులుకుని పోర్చుగల్ సిటిజన్ గా మారిపోయింది. ప్రస్తుతం కాస్త బొద్దుగా ఉంది కానీ ఫ్యాన్స్ ని ఎంటర్ టైన్ చేస్తూనే ఉంది. రీసెంట్ టైంలో హీరోయిన్ కత్రినా కైఫ్ బ్రదర్ సెబాస్టియన్ తో చెట్టాపట్టాలు తిరుగుతూ కనిపించింది. అలా ఇక్కడ సినిమాలు చేయనప్పటికీ వార్తల్లో ఉంటూనే వచ్చింది. తాజాగా ఆమె చిన్నప్పటి ఫొటో ఒకటి వైరల్ గా మారింది. మరి ఈమెని చిన్నప్పటి పిక్ లో చూసి మీలో ఎంతమంది గుర్తుపట్టారు? కింద కామెంట్ చేయండి.