తెలుగు హీరోపై స్టార్ హీరోయిన్ హన్సిక షాకింగ్ కామెంట్స్ చేసింది. డేట్ కి వస్తావా అని తనని ఆ నటుడు వేధించాడని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ విషయం కాస్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది.
తెలుగు ప్రేక్షకులకు భాషతో సంబంధం లేదు. ఒక్కసారి నచ్చాలే గానీ అందరినీ అభిమానిస్తారు. చెప్పాలంటే పిచ్చిపిచ్చిగా ప్రేమిస్తారు. ఈ విషయం మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడున్న చాలామంది స్టార్ హీరోలకు అలాంటి డైహార్డ్ ఫ్యాన్స్ బోలెడుమంది ఉన్నారు. హీరోయిన్లకు కూడా మన దగ్గర చాలా ఫాలోయింగ్ ఉంటుంది. హన్సిక ఈ లిస్టులో కచ్చితంగా ఉంటుంది. టీనేజ్ లోనే టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి సూపర్ క్రేజ్ తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఓ తెలుగు హీరో షాకింగ్ కామెంట్స్ చేసింది. అప్పట్లో తనని చాలా ఇబ్బంది పెట్టాడని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు హిందీ సినిమాల్లో నటించిన హన్సిక, ‘దేశముదురు’ మూవీతో హీరోయిన్ గా మారిపోయింది. అప్పటినుంచి ఇప్పటివరకు తెలుగు, తమిళంలో దాదాపు 50కి పైగా సినిమాల్లో నటించి చాలా క్రేజ్ తెచ్చుకుంది. గతేడాది సొహైల్ కతురియా అనే వ్యక్తిని గ్రాండ్ గా పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తూ లైఫ్ ని లీడ్ చేస్తుంది. అయితే తాను కూడా గతంలో టాలీవుడ్ లో ఇబ్బందులు ఎదుర్కొన్నానని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఓ తెలుగు హీరో తనని ఇబ్బంది పెట్టాడని, డేట్ కి వస్తావా అని అడిగేవాడని చెప్పుకొచ్చింది. తను అతడికి తగిన రీతిలో బుద్ది చెప్పి పంపించానని హన్సిక పేర్కొంది.
సినీ ఇండస్ట్రీలో ఎప్పటి నుంచి నటీనటులని వేధించడం లాంటివి ఉన్నప్పటికీ.. కొన్నాళ్ల ముందు నుంచి చాలామంది బయటకొస్తున్నారు. తమకు జరిగిన అనుభవాల్ని వెల్లడిస్తున్నారు. తాజాగా హన్సిక కూడా అలానే తనకు ఎదురైన చేదు సంఘటనల్ని బయటపెట్టింది. కానీ సదరు హీరో ఎవరనేది మాత్రం చెప్పలేదు. దీంతో ఇప్పుడీ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇదిలా ఉండగా హీరోయిన్ గా తెలుగులో ఓ మాదిరిగా ఆకట్టుకున్న హన్సిక.. తమిళంలో మాత్రం స్టార్స్ నటించి సూపర్ హిట్స్ కొట్టింది. ఇప్పుడు కెరీర్ ఫేడౌట్ అయిపోతే దశకొచ్చింది. బహుశా ఇందుకేనేమో తనకు జరిగిన అనుభవాల్ని బయటపెడుతోంది. మరి ఈ బ్యూటీ చెప్పిన విషయమై మీరేం అనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి.