తెలుగమ్మాయిలు సినిమాల్లోకి రావడం చాలా అరుదు. వచ్చినా సరే వాళ్లకు అరకొరగా తప్పించి పెద్దగా ఛాన్సులు రావు. ఇక వచ్చిన వాటిని సద్వినియోగం చేసుకుంటూ ఇండస్ట్రీలో సెటిలైన భామలు కొందరు ఉన్నారు. అందులో ఈమె కూడా ఒకటి. చీర కడితే కుందనపు బొమ్మలా ఉండే ఆ భామ.. మోడ్రన్ డ్రస్ వేస్తే కుర్రాళ్లు రెచ్చిపోవడం గ్యారంటీ. అంత బాగుంటుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళంలోనూ హీరోయిన్ గా చేసింది. ఇక ఆమెకు సంబంధించిన ఓ ఫొటో వైరల్ గా మారింది. మరి ఆ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా?
ఇక వివరాల్లోకి వెళ్తే.. పైన ఫొటోలో కనిపిస్తున్న చిన్నారి ఈషారెబ్బా. వరంగల్ లో పుట్టిన ఈ భామ.. పదేళ్ల క్రితమే టాలీవుడ్ లో హీరోయిన్ గా పరిచయమైంది. నటి కాకముందు పలు యాడ్స్ లో కనిపించింది. 2012లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమాలో జస్ట్ అలా మెరిసింది. అంతకు ముందు ఆ తర్వాత, అ!, సుబ్రహ్మణ్యపురం, బందిపోటు, అమితుమీ, దర్శకుడు లాంటి సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. ఇక ఎన్టీఆర్ ‘అరవింద సమేత’ సినిమాలో పూజాహెగ్డేకు అక్కగా కనిపించి ఆకట్టుకుంది.
సినిమాల్లో మంచి ఆరంభం దక్కినప్పటికీ.. స్టార్ గా ఫేమ్ తెచ్చుకోలేకపోయింది. ఇక ఓటీటీ కల్చర్ పెరిగిన తర్వాత త్రీ రోజెస్, పిట్టకథలు లాంటి వెబ్ సిరీసుల్లోనూ ఈషా సందడి చేసింది. కెరీర్ లో ఎక్కువగా తెలుగు సినిమాలు చేసిన ఈషా.. మలయాళంలో ‘ఒట్టు’, తమిళంలో ‘అయిరామ్ జెన్మంగాల్’ సినిమాలు చేసింది. ఇక రాజశేఖర్ కూతుర్లు శివాత్మిక, శివానిలకు ఫ్రెండ్ అయిన ఈమె.. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. తన ఫొటోలు, రీల్స్ తో ఎప్పటికప్పుడు నెటిజన్లని ఎంటర్ టైన్ చేస్తూనే ఉంటుంది. అలా ఈషా చిన్నప్పటి ఫొటో ఒకటి ఇప్పుడు కనిపించడంతో అందరూ ఆమెని గుర్తుపడుతున్నారు. మరి ఈషా చిన్నప్పటి ఫొటో మీకెలా అనిపించింది. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి.