ఈమె పుట్టిపెరిగింది దుబాయిలో. కానీ తెలుగులో హీరోయిన్ గా సెటిలైపోయింది. అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోతో సినిమాలు చేసింది. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన పన్నేండళ్లకు పైనే అవుతున్నా సరే ఇప్పటికీ తన అందాన్ని అలానే మెంటైన్ చేస్తోంది. కుర్రకారుని కుదురుగా కూర్చోనివ్వకుండా చేస్తోంది. అవకాశాలు కూడా అలానే అందుకుంటూ కెరీర్ లో సాగుతోంది. ఇవన్నీ కాదన్నట్లు సోషల్ మీడియాలోనూ ఎప్పుడు గ్లామరస్, హాట్ హాట్ ఫొటోలు పోస్ట్ చేస్తూ నెటిజన్స్ ని ఎంటర్ టైన్ చేస్తూనే ఉంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. హీరోయిన్ కేథరిన్ థ్రెసా గురించి టాలీవుడ్ లో కొంతమంది ప్రేక్షకులకు మాత్రమే తెలుసు. ఎందుకంటే దుబాయిలో పుట్టిన ఈమె.. అక్కడ 10వ వరకు చదివింది. ఆ తర్వాత 12వ తరగతి చదువు కోసం బెంగళూరు వచ్చింది. స్టడీస్ పూర్తయిన తర్వాత కన్నడ ఇండస్ట్రీలోనే ‘శంకర్ IPS’ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది. ఉపేంద్ర హీరోగా నటించిన ‘గాడ్ ఫాదర్’ ఈమెకి బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత ‘ఛలో’ చిత్రంతో తెలుగులోకి అడుగుపెట్టింది. అల్లు అర్జున్ ‘ఇద్దరమ్మాయిలు’లోనూ ఓ హీరోయిన్ గా చేసింది.
ఈ సినిమా మిశ్రమ ఫలితం అందుకోవడంతో మిడ్ రేంజ్ హీరోయిన్ గా మిగిలిపోయింది. ఆ తర్వాత సరైనోడు, నేనే రాజు నేనే మంత్రి, మద్రాసు ఈమెకి మంచి పేరు తీసుకొచ్చాయి. ఈ మధ్య కాలంలో వరల్డ్ ఫేమస్ లవర్, భళా తందనాన, బింబిసార, మాచర్ల నియోజకవర్గం తదితర చిత్రాల్లో నటించి అలరించింది. ఈ రెండింటిలో ‘బింబిసార’ హిట్ కాగా, మరో సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. చిరు ‘వాల్తేరు వీరయ్య’లోనూ ఓ కీలకపాత్ర చేస్తోంది. ప్రస్తుతం బాలీకి హాలీడే కోసం వెళ్లిన కేథరిన్.. ఎంజాయ్ చేస్తోంది. అందుకు సంబంధించిన ఫొటోల్ని కూడా పోస్ట్ చేస్తోంది. రెడ్ డ్రస్ లో అందాల ఆరబోస్తూ ఉన్న ఆమె స్టిల్స్.. నెటిజన్స్ అటెన్షన్ గ్రాబ్ చేస్తున్నాయి. మరి కేథరిన్ ఫొటోస్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.