సినిమాల్లో హీరోయిన్స్ భలే ముద్దుగా కనిపిస్తారు. క్యారెక్టర్స్ కోసం ఏం చేసేందుకైనా సరే రెడీ అంటూ ఉంటారు. అది రొమాన్స్ కావొచ్చు, పాత్ర కోసం బరువు పెరిగే-తగ్గే విషయంలో కావొచ్చు కొందరు భామలు ఏ మాత్రం ఆలోచించకుండా సై అంటూ ఉంటారు. కొన్నిసార్లు వాళ్లని చూస్తే అభిమానులే షాకయ్యేంతలా మారిపోతూ ఉంటారు. దీంతో సదరు బ్యూటీస్ ఇలా అయిపోయారేంటి అని నెటిజన్స్ తెగ మాట్లాడుకుంటూ ఉంటారు. స్టార్ హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ కు తాజాగా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఈ క్రమంలోనే ఆమె ఆరోగ్యంపై వార్తలొస్తున్నాయి.
ఇక వివరాల్లోకి వెళ్తే.. మలయాళంలో ‘స్వప్న సంచారి’ సినిమాతో బాలనటిగా పరిచయమైన అను ఇమ్మాన్యుయేల్, ‘యాక్షన్ హీరో బిజు’ మూవీతో హీరోయిన్ గా మారిపోయింది. తెలుగులో నాని హీరోగా నటించిన ‘మజ్ను’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పవన్ కల్యాణ్ తో ‘అజ్ఞాతవాసి’, అల్లు అర్జున్ తో ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ చిత్రాల్లో నటించింది. ఇక రీసెంట్ గా అల్లు శిరీష్ తో కలిసి ‘ఊర్వశివో రాక్షసివో’ మూవీతో ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేసింది. అలాంటి ఆమె ఇప్పుడు తన లేటెస్ట్ ఫొటోతో ఒక్కసారిగా షాకిచ్చినంత పనిచేసింది.
కెరీర్ ప్రారంభంలో మంచి ఫిజిక్, గ్లామర్ తో ఉన్న అను ఇమ్మాన్యుయేల్.. యూత్ లో ఫాలోయింగ్ బాగానే పెంచుకుంది. ఆ మధ్య కాస్త బరువు పెరగడంతో.. కొన్నాళ్లు డైటింగ్, హెవీ ఎక్సర్ సైజ్ చేస్తూ వచ్చింది. అలా సన్నగా మారినట్లు కనిపించింది. కానీ తాజాగా పట్టుచీర కట్టుకున్నానని చెబుతూ ఓ ఫొటో పోస్ట్ చేసింది. దీనిలో మరింత సన్నగా చెప్పాలంటే తీగలా కనిపిస్తోంది. దీంతో చాలామంది ఆమెని.. హెల్త్ ఓకేనా అని అడుగుతున్నారు. సినిమా ఛాన్సుల కోసం ఆరాటపడుతూ.. ప్రాణం మీదకు తెచ్చుకుంటుందేమోనని అను అభిమానులు కంగారుపడుతున్నారు. ఇప్పటికైనా సరే మించిపోయింది ఏం లేదని, కాస్త హెల్త్ పై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. మరి అను ఫొటో చూడగానే మీకేం అనిపించింది. కామెంట్స్ లో పోస్ట్ చేయండి.