కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ కలిసి నటిస్తున్న మూవీ ‘విక్రమ్’. లోకేష్ కనగరాజు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని కమల్ సొంత నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలింస్ పతాకంపై భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ముగ్గురు దిగ్గజ నటులు ఒకే సినిమాలో నటించడంతో ఈ సినిమాపై భారీ అంచానాలు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి తాజాగా మూవీ ట్రైలర్ విడుదల చేశారు మూవీ యూనిట్.
ఈ ట్రైలర్ లో కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫాజిల్ తమ నట విశ్వరూపాన్ని చూపించారు. తాజాగా విడుదల చేసిన ఈ ట్రైలర్ ప్రస్తుతం వైరల్ గా మారుతోంది. ఇక విషయం ఏంటంటే? ఈ సినిమాకు సంబంధించి ఓ అప్ డేట్ తాజాగా నెట్టింట చక్కర్లు కోడుతోంది. విక్రమ్ సినిమాలో హీరో సూర్య కనిపించనున్నాడనే వార్తలు ఫిల్మ్ నగర్ లో తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
ఇది కూాడా చదవండి: RRR బాటలోనే KGF-2 సినిమా కూడా.. OTTలో చూడాలంటే డబ్బు కట్టాల్సిందే!
అయితే సూర్య నటిస్తున్నాడనే ఈ వార్తలపై తాజాగా ఓ క్లారిటీ ఇచ్చాడు డైరెక్టర్ లోకేష్ కనగరాజు. విక్రమ్ మూవీలో ఈ మూగ్గురు స్టార్ హీరోలతోపాటు సూర్య కూడా నటిస్తున్నాడని దర్శకుడు కనగరాజు చెప్పాడు. ఇందులో సూర్య ఓ కీలక పాత్రలో నటించనున్నాడని తెలిపారు. దీంతో ఈ ముగ్గురు హీరోలతో పాటు సూర్య కూడా నటిస్తున్నాడని తెలియడంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక విక్రమ్ సినిమాలో హీరో సూర్య కనిపించనుండడంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.