ఈ మద్య సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రముఖ సింగర్ సంగీతని దారుణంగా హత్య చేశారు. ఢిల్లీకి చెందిన ఈమె గత పన్నెండు రోజుల క్రితం కిడ్నాప్ అయ్యింది. భైరోన్ భైనీ అనే గ్రామ సమీపంలో సంగీత మృత దేహం లభించింది. దుండగులు ఆమెను దారుణంగా హతమార్చి ఇక్కడ పూడ్చి పెట్టారు. ఆమె అర్థనగ్నంగా ఉండటం చూస్తుంటే.. తమ కూతురుపై అత్యాచారం జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు సంగీత తల్లిదండ్రులు.
తన గానంతో ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచిన సంగీత మే 11 వ తేదీ నుంచి ఎవరికీ కనిపించకుండా పోయింది. తమ కూతురు కనిపించడం లేదని మే 14న ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రోహిత్, రవి అనే ఇద్దరు వ్యక్తులు ఆమెను కిడ్నాప్ చేసి ఉంటారని కేసు పెట్టారు. చివరికి సంగీత చనిపోయిన విషయం తెలిసిందే. పోలీసులు పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు.ఒక హూటల్ లో గాయినితో రవి, రోహిత్ లు ఉన్నట్లు సీసీ ఫుటేజ్ ద్వారా తెలుసుకున్నామని.. నింధితుల్లో ఇప్పటికే ఒకరిని అరెస్ట్ చేయగా మరో వ్యక్తి కోసం వెతుకుతున్నామని అన్నారు.
Haryana | We received a mutilated body last evening near Bhaini Bhairon village;it couldn’t be identified… later, we found that an FIR u/s 365 IPC was filed in the matter at Jaffarpur PS,Delhi. Body identified to be of a Sangeeta (Haryanvi singer): SI Vikas, Meham Police pic.twitter.com/mBIV0QmAXj
— ANI (@ANI) May 23, 2022