పై ఫొటోలో నవ్వులు చిందిస్తూ కనిపిస్తున్న పిల్లాడు స్టార్‌గా ఓ వెలుగు వెలిగాడు. మంచి మంచి హిట్టు సినిమాల్లో నటించాడు. అలాంటి ఆయన ఉన్నట్టుండి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
చిత్ర పరిశ్రమలో విషాదాలకు, డెత్ మిస్టరీలకు కొదువలేదు. హీరోలు కావచ్చు.. హీరోయిన్స్ కావచ్చు.. కొంతమంది మరణానికి గల కారణాలు ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్నల్లానే మిగిలిపోయాయి. టాలీవుడ్ టు బాలీవుడ్ అంతా ఇదే పరిస్థితి. పైన ఫొటోలో నవ్వులు చిందిస్తున్న పిల్లాడు కూడా పెద్దాయ్యాక ఎన్నో ఆశలతో సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. అంచెలంచెలుగా ఎదిగి స్టార్ హీరో అయ్యాడు. స్టార్‌గా మంచి మంచి విజయాలను సొంతం చేసుకుంటూ ముందుకు దూసుకుపోతున్నాడు. అలాంటి సమయంలో అతడి జీవితంలో ఒడిదుడుకులు మొదలయ్యాయి.
సినిమా కెరీర్ కొంచెం కొంచెం ఇబ్బందుల్లో పడుతూ వచ్చింది. దీంతో అతడు తట్టుకోలేకపోయాడు. డ్రగ్స్‌కు బానిసయ్యాడు. జూన్ 14న, 2020.. ఇదే రోజున ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పటికే మీకు అర్థం అయి ఉంటుంది. ఆ ఫొటోలో ఉన్న వ్యక్తి ఎవరో అని. అతడు ప్రముఖ బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్. సుశాంత్ సీరియల్స్ ద్వారా తన నటనా ప్రస్థానాన్ని మొదలుపెట్టాడు. 2008లో ‘కిస్ దేశ్ మే హై మేరా దిల్’ అనే సీరియల్‌లో నటించాడు. తర్వాత పవిత్ర రిస్త అనే మరో సీరియల్‌లోనూ అతడు నటించాడు.
2013లో వచ్చిన ‘కాయ్ పోచే సినిమాతో వెండి తెరపై అడుగుపెట్టాడు. ఎమ్‌ఎస్ ధోనీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన బయోపిక్‌లో ధోనీగా నటించి దేశ వ్యాప్తంగా గుర్తింపుతెచ్చుకున్నాడు. 2020, జూన్ 14న ముంబై, బాంద్రాలోని ప్లాట్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన ఆత్మహత్య చేసుకుని 3 ఏళ్లు గడుస్తున్నా.. ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడన్నది మిస్టరీగానే మిగిలిపోయింది. బాలీవుడ్‌లో నెపోటిజం కారణంగా పెద్ద పెద్ద అవకాశాలు కోల్పోయాడని, అది తట్టుకోలేక సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడన్న ప్రచారం కూడా ఉంది.