చిన్నప్పటి సంఘటనలంటే అందరికీ ఓ మర్చిపోలేని జ్ఞాపకం. అప్పటి ఫోటోలను అపురూపంగా చూసుకుంటుంటారు. పెద్దయ్యాక ఆల్బమ్ ఓసారి తిరగేసి చూసుకుంటే కలిగే ఫీలింగే వేరు.
చిన్నప్పటి సంఘటనలంటే అందరికీ ఓ మర్చిపోలేని జ్ఞాపకం. అప్పటి ఫోటోలను అపురూపంగా చూసుకుంటుంటారు. పెద్దయ్యాక ఆల్బమ్ ఓసారి తిరగేసి చూసుకుంటే కలిగే ఫీలింగే వేరు. అలాగే సోషల్ మీడియాలో సినీ పరిశ్రమకు చెందిన వారి చైల్డ్‌హుడ్ పిక్స్ ఎంతలా వైరల్ అవుతుంటాయో తెలిసిందే. నటసింహా నందమూరి బాలకృష్ణ ఎత్తుకుని ఉన్న ఈ చిన్నారి ఎవరో తెలుసా?.. నందమూరి ఫ్యామిలీకి సంబంధించి, ఎన్టీరామారావు పిల్లలు, వారి పిల్లలు, వారి పిల్లల పిల్లలు.. ఇలా దాదాపు నాలుగు దశాబ్దాలకు చెందిన వారి రేర్ పిక్స్ ప్రేక్షకాభిమానులకు చాలా అరుదుగానే తెలుసు. బాలయ్య అభిమానులైతే అలాంటి రేర్ ఫోటోలను భద్రంగా దాచుకుని సందర్భాన్ని బట్టి సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేస్తుంటారు.
బాలయ్య చేతిలో ముద్దులొలికిస్తూ, క్యూట్‌గా ఉన్న ఈ బుడ్డోడు ఎవరో కాదు.. ఎన్టీఆర్ మనువడు, నందమూరి మోహన కృష్ణ తనయుడు, నందమూరి తారక రత్న. బాలయ్యకు అన్నయ్యే మోహన కృష్ణ. ఆయన ఏకైక వారసుడు తారక రత్న. తనకు చిన్నప్పుడు ముఖం మీద కురుపుడు కాయ ఉండేది. తర్వాత తొలగించుకున్నట్లున్నారు. బాలయ్య తన అన్నయ్యగారి అబ్బాయిని ఎత్తుకోగా.. బాబాయ్‌ని ఆప్యాయంగా హత్తుకుని ఉన్న తారక రత్న చిన్ననాటి పిక్ అందర్నీ ఆకట్టుకుంటుంది. ‘ఒకటో నంబర్ కుర్రాడు’ మూవీతో హీరోగా ఇంట్రడ్యూస్ అయిన తారక్.. ఎంట్రీతోనే రేర్ రికార్డ్ సెట్ చేశాడు.
ఒకే రోజు తను హీరోగా నటించబోయే 9 సినిమాలు ప్రారంభోత్సవం జరుపుకోవడం అప్పట్లో సెన్సేషన్. ఇప్పటికీ మరపురాని సంఘటన అది. ‘యువరత్న’, ‘తారక్’, ‘భద్రాద్రి రాముడు’, ‘వెంకటాద్రి’, ‘నందీశ్వరుడు’ వంటి పలు సినిమాల్లో హీరోగా అలరించిన తారక రత్న.. ‘అమరావతి’, ‘రాజా చెయ్యి వేస్తే’ లాంటి చిత్రాల్లో విలన్‌గానూ ఆకట్టుకున్నారు. ‘9 అవర్స్’ వెబ్ సిరీస్‌లో పోలీస్ క్యారెక్టర్‌లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. తనకెంతో ఇష్టమైన బాల బాబాయ్‌తో అబ్బాయ్ తారక్ కలిసి ఉన్న ఈ అరుదైన ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది.