నటసింహం నందమూరి బాలకృష్ణ.. ఈ పేరు వినగానే తెలుగు ప్రేక్షకుల్లో పూనకాలు వస్తాయి. మాస్ డైలాగ్ చెప్పాలన్నా, మాస్ డాన్స్ చేయాలన్నా బాలయ్య తర్వాతే ఎవరైనా అంటూ ఫ్యాన్స్ చెబుతూ ఉంటారు. అటు బాలయ్య కూడా వన్స్ ఐ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్స్ అంటూ డైలాగులతో కాకుండా రికార్డులతో కూడా సమాధానం చెబుతూ ఉంటాడు. అఖండతో సాధించిన అఖండ విజయాన్ని మరువక ముందే NBK 107తో ఇంకో మాస్ జాతర చేయబోతున్నట్లు చెప్పక చెప్పేశాడు. గోపీ చంద్ మలినేని డైరెక్షన్‌లో అదిరిపోయే మాస్ సినిమాని సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇప్పటికే ఎన్‌బీకే 107 పోస్టర్, డైలాగ్ టీజర్ లాంటివి చూసి పిచ్చెక్కిపోయి ఉన్న అభిమానులకు టైటిల్ అనౌన్స్ మెంట్‌తో మంచి కిక్ ఇచ్చారు.
కర్నూలు కొండారెడ్డి బురుజులో బాలయ్య తర్వాతి సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ ప్లాన్ చేశారు. ఎన్‌బీకే 107 వీరసింహారెడ్డి బాస్ ఆఫ్ మాసెస్ అనే ట్యాగ్ లైన్‌తో సినిమా రాబోతోంది. బాలయ్య గెటప్‌కు ఆ స్వాగ్‌కు పెట్టిన పేరు చూస్తే.. చెన్నకేశవరెడ్డి రోజులు గుర్తొస్తున్నాయంటూ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. నిప్పురవ్వ, చెన్నకేశవరెడ్డి, నరసింహనాయుడు, సింహా, లెజెండ్ వంటి సినిమాలను సైతం మించిపోతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమా నుంచి మరిన్ని ఇంట్రస్టింగ్ విషయాలు కూడా ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. ప్రేక్షకులు వింటేజ్ బాలయ్యను చూడబోతున్నారంటూ చెబుతున్నారు.
అవేంటంటే.. వీరసింహారెడ్డి సినిమాలో బాలకృష్ణ డ్యూయల్ రోల్ చేయబోతున్నాడంట. అంతేకాకుండా మూడు క్యారెక్టర్లను చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ సినిమాలో మొత్తం 11 ఫైట్లు ఉన్నాయని వస్తున్న టాక్ చూస్తుంటే సినిమా ప్రేక్షకులు బిత్తరపోతున్నారు. ఎందుకంటే బాలయ్య స్క్రీన్ మీద ఫైట్ చేస్తే ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. అలాంటిది ఒకే సినిమాలో 11 పోరాట సన్నివేశాలు అంటే.. స్క్రీన్స్ మొత్తం తగలబడిపోతాయంటూ కామెంట్ చేస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తుండగా సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాశాడు. తమన్ మరోసారి అఖండ కాంబో రిపీట్ చేస్తాడంటూ చెబుతున్నారు.
NATASIMHAM #NandamuriBalakrishna in and as ‘VEERA SIMHA REDDY’ ❤️🔥
Meet the GOD OF MASSES in theatres this Sankranthi 🔥🤙#VeeraSimhaReddy@megopichand @shrutihaasan @OfficialViji @varusarath5 @RishiPunjabi5 @MusicThaman @SonyMusicSouth pic.twitter.com/ndAC0dvkhd
— Mythri Movie Makers (@MythriOfficial) October 21, 2022