టాలీవుడ్ లో చైల్డ్ ఆర్టిస్టులుగా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత హీరోయిన్లుగా, హీరోలుగా ఎదిగినవారు ఉన్నారు. ఇంకొందరు చైల్డ్ ఆర్టిస్టుగా కొన్ని సినిమాలు చేసి ఆ తర్వాత చదువు మీద శ్రద్ధతో ఇండస్ట్రీని వీడిన వారు కూడా ఉన్నారు. ఆ కోవకు చెందిన వారిలో అల్లు అర్జున్ గంగోత్రీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ కావ్యా కల్యాణ్ రామ్ కూడా ఒకరు. ‘వల్లంకి పిట్టా వల్లంకి పిట్టా’ అంటూ టాలీవుడ్ ప్రేక్షకుల్లో ఎంతో మంది అభిమానులను కూడా సొంతం చేసుకుంది.
అయితే టాలీవుడ్ లో గంగోత్రీ తర్వాత.. బాలకృష్ణతో విజయేంద్ర వర్మ, చిరంజీవి ఠాగూర్, నాగార్జున స్నేహమంటే ఇదేరా, పవన్ కల్యాణ్ తో బాలు సినిమాల్లో నటించి మెప్పించింది. కానీ, ఆ తర్వాత చదువుకోవాలంటూ ఇండస్ట్రీని వదిలి వెళ్లిపోయింది.
2019లో “లా” పట్టా కూడా అందుకుంది. ఆ తర్వాత మళ్లీ సినిమాలపై దృష్టి పెట్టిన కావ్యా కల్యాణ్ రామ్ 2020లో మసూద అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. కానీ, ఆశించిన ఫలితాన్ని అందుకోలేక పోయింది.
అప్పటి నుంచి సినిమా ప్రయత్నాలు చేస్తున్న కవ్యా కల్యాణ్.. సోషల్ మీడియాలో మాత్రం ఫ్యాన్ బేస్ పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. రోజూ మంచి మంచి పిక్స్ పెడుతూ ఫ్యాన్స్ తో ఇంటరాక్ట్ అవుతూ వస్తోంది కొన్నిసార్లు కాస్త బోల్డ్ పిక్స్ కూడా పెడుతూ కుర్రకారును ఆకట్టుకుంటోంది.
అయితే టాలీవుడ్ లో ఇంకా సరైన అవకాశం ఎదురుచూస్తోందనే చెప్పాలి. ప్రస్తుతం మరోసారి కావ్యా కల్యాణ్‌రామ్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కావ్యా కల్యాణ్ రామ్ ఫొటోలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.