కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి తనయుడు గాలి కిరీటి రెడ్డి సినీరంగ ప్రవేశం చేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే గాలి కిరీటి కన్నడ, తెలుగు ఇండస్ట్రీకి హీరోగా పరిచయంగా కాబోతున్నాడు. ఈ సినిమాను యువ దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కిస్తుండగా, ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తుండగా..కె సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు తీసుకున్నారు. పీటర్ హెయిన్ స్టంట్స్ పనిచేస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ మేకింగ్ వీడియో వైరల్ మారింది.
ఇందులో సినిమా కోసం స్కేటింగ్ ధరించి కిరీటి ఓ రేంజ్ లో కష్టపడుతున్నాడు. ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్ ఆధ్వర్యంలో కిరీట్ చేసిన స్టంట్స్ అందరిని ఆకట్టుకున్నాయి. ఉన్నత కుటుంబం నుంచి వచ్చినా కూడా సినిమా కోసం తీవ్రంగా కిరీటి శ్రమిస్తున్నాడు. ఈ క్రమంలో అతని చేతులకు, కాళ్లకు గాయాలు అయ్యాయి. అయిన షూటింగ్ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యహరించకుండా హీరో కిరీటి కష్టపడుతున్నాడు. తాను ఓ పెద్ద కుటుంబ నుంచి వచ్చిన అన్న విషయం మరచి.. ఓ సాధారణ నటుడిగా అన్ని విషయాల్లో గట్టిగా శ్రమిస్తున్నాడు. కిరీటి చేసిన స్టంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమా కోసం కిరీటి కష్టపడిన తీరును చూసిన నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఆ వీడియోపై మీరు ఓ లుక్కేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.