‘అవతార్‘.. అదొక సినిమా పేరు మాత్రమే కాదు, అంతకు మించి. అదొక ఊహా ప్రపంచం! ఆ ప్రపంచంలో ప్రేక్షకులు విహరించారు అంతే. 2009లో అవతార్ తొలిసారిగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అప్పుడంతా టెక్నాలజీ లేదు. అయినప్పటికీ గ్రాఫిక్స్ లో వండర్స్ క్రియేట్ చేశారు. సినిమా చూసిన వారందరూ ఎలా తీశారు రా బాబోయ్ అని నోరెళ్లబెట్టారు. దానికి సీక్వెల్ గా పదమూడేళ్ళ తర్వాత ‘అవతార్ 2’ ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. ఈ సందర్బంగా అవతార్ వేషధారణలో ఫాన్స్ రచ్చ చేస్తున్నారు.
హాలీవుడ్ ఫిల్మ్ మేకర్ జేమ్స్ కామెరాన్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 160 భాషల్లో విడుదలైంది. తెలుగు రాష్ట్రాలలో ఆ థియేటర్ లో చూసిన ఈ సినిమా సందడే. సీట్లలో కూర్చొన్న ఆడియన్స్.. ఆ మూవీని చూస్తూ తమని తాము మైమరచిపోతున్నారట. పండోరా ప్రపంచంలో విహరిస్తున్నారట. నిడివి ఎక్కువగా ఉన్నా దర్శకుడు జేమ్స్ కామెరాన్ ఈ సినిమాను ఎంతో అద్భుతంగా మలిచారని తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. కొందరు సినీ లవర్స్ సినిమాపై మక్కువతో అవతార్ వేషధారణలో కనువిందు చేస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.