సౌత్ ఇండియా లేడీ అమితాబ్ నయనతారకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగుతో పాటు తమిళం, మలయాళ భాషల్లోనూ ఆమెకు మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ప్రస్తుతం ఆమె కోలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతున్నారు. దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో పెళ్లి తర్వాత కేవలం లేడీ ఓరియెంటెడ్ సినిమాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. అది కూడా సస్పెన్స్, క్రైం, హర్రర్ సినిమాలను చేస్తున్నారు. ఆమె నటించిన తాజా చిత్రం ‘‘కనెక్ట్’’ కూడా హర్రర్ జానర్‌లో తెరకెక్కింది. ఈ సినిమా డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ నేపథ్యంలో గత కొద్దిరోజుల నుంచి నయనతార సినిమా ప్రమోషన్లలో బిజీబిజీగా గడుపుతున్నారు. మంగళవారం చెన్నైలోని క్రిష్ణ వేణి థియేటర్‌లో ప్రిమియర్ షో నిర్వహించారు. ఈ షోకు నయనతార తన భర్త విఘ్నేష్ శివన్‌తో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. ఓ అభిమాని విఘ్నేష్ ముందే నయనతారకు ‘‘ ఐ లవ్ యూ’’ చెప్పాడు. నయనతార దీనికి ఏమాత్రం కోప్పడకుండా చాలా కూల్‌గా సమాధానం ఇచ్చారు. తనకు ఐ లవ్ యూ చెప్పిన ఫ్యాన్ కోసం వెతకటమే కాకుండా అతడికి ‘‘ ఐ లవ్ యూ టూ’’ అని చెప్పారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కాగా, కనెక్ట్ సినిమా తెలుగులోనూ అదే పేరుతో రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా నయనతార యాంకర్ సుమకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో హీరో ప్రభాస్ గురించి నయన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభాస్ ఎంతో మంచి వాడని, అతడిది చిన్నపిల్లాడి మనస్తత్వమని అన్నారు. ప్రభాస్ ఇప్పటికీ అలాగే ఉన్నాడో లేదో తనకు తెలీదని చెప్పారు. తాను అతడితో పని చేసినపుడు మాత్రం అచ్చం చిన్నపిల్లాడిలాగా ప్రవర్తించేవాడని, అక్కడికీ ఇక్కడికీ గెంతేవాడని తెలిపారు. జోకులు బాగా వేసేవాడన్నారు. అతడితో ఉండటం సరదాగా ఉండేదంటూ వ్యాఖ్యానించారు.
#Connect – It’s a complete show by LADY SUPERSTAR NAYANTHARA , brilliant screenplay and a good movie to experience it in big screens !
CONNECT FROM DECEMBER 22 In your @vasutheatre @VigneshShivN @Rowdy_Pictures pic.twitter.com/v19NzOzvcF— Vasu Cinemas (@vasutheatre) December 19, 2022