పుష్ప.. ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో క్రియేట్ చేసిన రికార్డులు, తీసుకొచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. ఎవరినీ కదిలించినా.. తగ్గేదేలే అంటూ డైలాగులు చెప్పడమే. బాలీవుడ్ లో అయితే ఐకాన్ స్టార్ బన్నీ యాక్టింగ్, మేనరిజానికి అంతా ఫిదా అయిపోయారు. పుష్ప-2 ఎప్పుడెప్పుడా అంటూ ఇప్పటి నుంచే ఎదురుచూపులు ప్రారంభించేశారు.
పుష్ప-2పై నెలకొన్న అంచనాలను రీచ్ అయ్యేందుకు సుకుమార్ స్పెషల్ కేర్ తీసుకున్నట్లు తెలుస్తోంది. కథను కూడా కాస్త మారుస్తున్నట్లు అల్లు అర్జున్ ఎలివేషన్ విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. మరోవైపు కొత్తగా మరికొన్ని పాత్రలను కూడా పరిచయం చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే విజయ్ సేతుపతి ఈ సినిమాలో సాలిడ్ రోల్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి.
0
#Pushpa Big Breaking ..!!!
Pushpa 3rd part is possible 😎#FahadhFaasil opened in his latest interview that director #Sukumar recently told him that we have scope for #Pushpa3 also ..🔥#AlluArjun #PushpaTheRise #PushpaTheRule pic.twitter.com/M5imcaPWOV
— Kandula Dileep (@TheLeapKandula) July 19, 2022
ఇప్పుడు ఆ లిస్ట్ లోకి బాలీవుడ్ స్టార్ యాక్టర్ మనోజ్ భాజ్‌పాయి పేరు కూడా చేరింది. మనోజ్ భాజ్‌పాయికి ఇప్పటకే సుకుమార్ కథ కూడా వినిపించారని అందుకు మనోజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. గతంలో బన్నీతో కలిసి మనోజ్ భాజ్‌పాయి హ్యాపీ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. మనోజ్ ఎంట్రీతో పుష్ప 2 సినిమాకి బాలీవుడ్ క్రేజ్ మరింత పెరుగుతుందని చెబుతున్నారు.
Fahadh Confirmed ✅ #Pushpa3 @alluarjun 🤙 pic.twitter.com/dAl2w3Mj9O
— Rajesh Bunny™⛏️🥁💥 (@RajeshBunny654) July 19, 2022
మరోవైపు ఈ సినిమాపో ఇంకో ఇంట్రస్టింగ్ విషయం ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. పుష్ప సినిమా ఒకటి, రెండు పార్టులతో ఆగేది కాదంట. దీనిని మొదట ఒక సిరీస్ గా ప్లాన్ చేశారంట. అయితే ఈ మాటలు వాళ్లు, వీళ్లు చెప్పినవి కావు. ఏకంగా భన్వర్ సింగ్ షెకావత్ గా చేసిన ఫహద్ ఫాజిల్ స్వయంగా ఓ ఇంటర్వూలో చెప్పాడు. పుష్ప-3 కూడా ఉందంటూ ఫ్యాన్స్ కు హింట్ ఇచ్చేశాడు.
ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “పుష్ప సినిమాని మొదట నెట్ ఫ్లిక్స్ లో ఓ సిరీస్ లా తీసుకురావాలని అనుకున్నారు. ఆ కథలో అంత మ్యాటర్ ఉంది. ఇటీవలే సుకుమార్ నాతో పుష్ప-3కి రెడీ అవ్వమని చెప్పారు. తెలుగు డైలాగులు నేర్చుకునేందుకు.. అల్లు అర్జున్, సుకుమార్ సార్ నాకు చాలా టైమ్ ఇచ్చేవారు. షూట్ లో నేను ఎంతో కంఫర్టబుల్ గా ఉండేవాడిని” అంటూ ఫహద్ పుష్ప సినిమాపై క్రేజీ అప్డేట్ ఇచ్చాడు.
Pushpa part 3 is possible 🔥 #PushpaTheRule
pic.twitter.com/sM6sYkoGZO— Monika (@Iam_MonikAArjun) July 19, 2022
ఫహద్ చెప్పిన ఈ మాటతో బన్నీ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా ఉన్న పుష్ప ఫ్యాన్స్ అంతా సంబరపడిపోతున్నారు. అందరూ సుకుమార్ పార్ట్ 2తో సినిమాని ముగిస్తాడని భావించారు. ఇప్పుడు పార్ట్ 3 కూడా అనేసరికి అందరూ సంభ్రమాశ్చర్యాలకు గురవుతున్నారు. ‘పుష్ప రూల్’ అనేది జస్ట్ బిగినింగ్ మాత్రమే అంటూ సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. పుష్ప-3 ఉందనే వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.