పరుగులు పెడుతున్న టెక్నాలజీ యుగంలో ప్రతీ ఒక్కరు ఇంగ్లీష్‌లో మాట్లాడుతున్నారు. ఇటు ఎల్‌కేజీ పిల్లల నుంచి అటు మధ్య వయసుల వాళ్ల వరకు గడగడ మాట్లాడుతున్నారు. కానీ ఓ పండు ముసలి బామ్మ మాట్లాడే ఇంగ్లీష్‌కు మాత్రం అందరూ ఫిదా అవుతున్నారు. అయినా దీంట్లో వింతేముంది అనుకుంటున్నారా? వింత లేకపోవచ్చు కానీ మాట్లాడింది మాత్రం కాలెజీ ప్రిన్సిపల్ కాదు, యూనివర్సిటీ చాన్స్‌లర్ కాదు, ఓ చెత్త ఎరుకునే ముసలవ్వ.
ఈ బామ్మ మాట్లాడే ఇంగ్లీష్‌కు నెటిజన్స్ అంతా ఆశ్చర్యపోతున్నారు. ఇక తెలుగు మీడియంలో చదువుకుని పీజీలు చేసిన యువతి యువకులు మాత్రం ముక్కున వేలేసుకుంటున్నారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..బెంగుళూరులోని సిసిలియా మార్గరెట్ అనే ఈ ముసలవ్వ ఇంగ్లీష్‌లో అద్భుతంగా మాట్లాడుతూ చదువుకున్న విద్యార్థులకు సవాల్ విసురుతోంది. ఇక ఈ బామ్మ బెంగుళూరు ఓ చర్చిని శుభ్రం పరుస్తూ ప్లాస్టిక్ వస్తువులు సేకరించి అమ్ముతానని చెబుతోంది.
దీంతోనే నా జీవనాధారం ముడిపడి ఉందని అంటున్న ముసలవ్వ మాటలు మీరు కూడా ఓ సారి వినండి. ఇక కొందరు స్థానికులు ఆమె మాట్లాడే ఇంగ్లీష్‌ను వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. దీంతో ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇక దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో మాకు తెలియజేయండి.