టాలీవుడ్ ప్రేక్షకులతో పాటు ఇండియన్ సినిమా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ప్రాజెక్ట్ కె ఒకటి. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్ తో పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కిస్తున్న ఈ మూవీలో.. ఓ పాన్ ఇండియా స్టార్ స్పెషల్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం టాలీవుడ్ లో పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తోంది. ఇక టాలీవుడ్ ప్రేక్షకులు అత్యంత ఆసక్తితో ఎదురుచూస్తున్న సినిమాల్లో రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలే ఎక్కువగా ఉన్నాయి. సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ కె లాంటి సినిమాలు వరుసగా రిలీజ్ లకు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రాజక్ట్ కె కు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే ప్రాజెక్ట్ కె సినిమాలో ఓ పాన్ ఇండియా స్టార్ కామియో రోల్ చేస్తున్నాడట. అతడి పాత్ర సినిమా కథనే మలుపు తిప్పేదిగా ఉంటుందని సమాచారం.
రెబల్ స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ.. ఫుల్ బిజీగా ఉన్నాడు. చేతిలో నాలుగు సినిమాలు ఉన్న ఏకైక స్టార్ హీరోగా టాలీవుడ్ లో దూసుకెళ్తున్నాడు. ఇక ప్రభాస్ తాజాగా నటిస్తున్న చిత్రాల్లో ప్రాజెక్ట్ కె ఒకటి. ఇండియన్ ఫిల్మ్ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు నిర్మాతలు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ బిగ్ బితో పాటుగా దీపికా పదుకొణె కూడా నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ సినిమాలో మరోస్టార్ హీరో కూడా చేరబోతున్నట్లు సమాచారం. ఇంతకి ఆ హీరో ఎవరంటే? మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్. ప్రాజెక్ట్ కె చిత్రంలో ఓ కామియో రోల్ చేస్తున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి.
అయితే ఇందులో దుల్కర్ పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ కథను కీలక మలుపుతిప్పే పాత్రగా ఉండనున్నట్లు సమాచారం. అయితే ఈ వార్తను కొట్టిపారేయలేం. ఎందుకంటే ప్రాజెక్ట్ కె బ్యానర్ అయిన వైజయంతి మూవీస్ లో ఇప్పటికే రెండు చిత్రాల్లో నటించాడు దుల్కర్. దాంతో వారి మధ్య ఏర్పడ్డ సాన్నిహిత్యం కారణంగానే దుల్కర్ ప్రాజెక్ట్ కెలో నటించడానికి ఒప్పుకున్నట్లు సమాచారం. తాజాగా ప్రాజెక్ట్ కె సంబంధించిన రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు మేకర్స్. వచ్చే సంవత్సరం జనవరి 12న థియేటర్లలో సందడి చేయనుంది ప్రాజెక్ట్ కె. మరి ప్రభాస్ సినిమాలో దుల్కర్ సల్మాన్ చేస్తే ఎలా ఉంటుందో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Dulquer Salmaan impactful role in Project Khttps://t.co/EuaZG6f27d#Prabhas #ProjectK #DulquerSalman #deepikapadukone #cinejosh pic.twitter.com/wLS2RVHLt9
— CineJosh (@cinejosh) February 20, 2023