సినీ ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్ లుగా సినిమాలు చేయకపోయినా.. టీనేజ్ దాటే వయసులో దాదాపు అందరు ముద్దుగుమ్మలు హీరోయిన్స్ గా సినిమాల్లో ఎంట్రీ ఇస్తుంటారు. వారిలో కొంతమందిని చూడగానే ఏముందిరా అని.. మరికొందరిని చూస్తే.. అందాన్ని కాకుండా యాక్టర్ గా ప్రేమించాలని అనిపిస్తుంది. ఫస్ట్ టైమ్ చూసినా కొందరు హీరోయిన్స్ మనలో చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంటారు. అలాంటి వారిలో ఒకరే.. నేనిప్పుడు చెప్పబోయే బ్యూటీ. ఈమె గురించి టాలీవుడ్ మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా మాట్లాడుకుంటారు. ఓవైపు నటిగా స్కోప్ ఉన్న రోల్స్ చేస్తూనే.. మరోవైపు గ్లామరస్ క్యారెక్టర్స్, ఐటమ్ సాంగ్స్ తో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా పేరొందింది.
ఇంతకీ ఆ బ్యూటీ ఎవరా అనుకుంటున్నారా? తెలుగులో డెబ్యూ మూవీనే బ్లాక్ బస్టర్ అందుకుంది. ఏకంగా సూపర్ ఫామ్ లో ఉన్న విక్టరీ వెంకటేష్ సరసన డెబ్యూ చేయడం విశేషం. ఆ తర్వాత నటసింహం నందమూరి బాలకృష్ణతో సినిమా చేసి.. బాలీవుడ్ కి ఎగిరిపోయింది. ఇప్పటికైనా గుర్తొచ్చిందా ఆ గ్లామరస్ హీరోయిన్ ఎవరో..? ఆమె ఎవరో కాదు.. కత్రినా కైఫ్. అవును.. హీరోయిన్ గా మొదటి అవకాశం తెలుగులోనే దక్కించుకుంది. 2003లో వెంకీ సరసన ‘మల్లీశ్వరి’ సినిమాతో డెబ్యూ చేసిన కత్రినా.. 2005లో బాలయ్యతో ‘అల్లరి పిడుగు’ సినిమా చేసి.. బాలీవుడ్ కి మకాం మార్చేసింది. ఎందుకంటే.. ఆమె మొదటి నుండి బాలీవుడ్ లక్ష్యంగానే ఇండస్ట్రీలో అడుగుపెట్టింది.
కత్రినా గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే.. బాలీవుడ్ లో దాదాపు అందరూ అగ్ర హీరోల సరసన బ్లాక్ బస్టర్ సినిమాలు చేసింది. ఆ మధ్యలో ఇద్దరు ముగ్గురితో లవ్ – బ్రేకప్స్ తర్వాత రీసెంట్ గా తనకన్నా వయసులో చిన్నవాడైన హీరో విక్కీ కౌశల్ ని పెళ్ళాడి సర్ప్రైజ్ చేసింది. ఇక పెళ్లి అయినప్పటి నుండి సినిమాలు చాలా సెలెక్టెడ్ గా చేస్తోంది భామ. అంతకుముందు వరుసగా గ్లామర్ రోల్స్ తో పాటు ఐటమ్ సాంగ్స్ లో ఆడిపాడి రచ్చ లేపి.. హాట్ బాంబ్ అనిపించుకుంది. కానీ.. పెళ్లయ్యాక కేవలం నటనకు స్కోప్ ఉన్న పాత్రలే చేస్తుండటం విశేషం. తాజాగా కత్రినాకి సంబంధించి ఓ చైల్డ్ హుడ్ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చిన్నప్పుడు ఫొటోలో కత్రినా క్యూట్ నెస్ కి ఫిదా అయిపోయి ఆమె ఫ్యాన్స్, నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.