ఇండస్ట్రీలో సెలబ్రిటీల మెమోరీస్.. అభిమానులకు కూడా స్పెషల్ గానే అనిపిస్తాయి. ఎందుకంటే.. ఆయా సెలబ్రిటీలపై ఉండే అభిమానం అలాంటిది. కొత్తగా అప్ డేట్స్ తెలిసినా.. లేదా తెలియని విషయాలు తెలిసినా ఆ రోజంతా ఫ్యాన్స్ ఎంతో ఆనందంగా ఉంటారు. సెలబ్రిటీల ప్రొఫెషనల్ లైఫ్ నే కాదు.. వాళ్ళ పర్సనల్ లైఫ్ లోని చిన్న చిన్న విషయాలు కూడా సెలబ్రేట్ చేసుకుంటారు ఫ్యాన్స్.
సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీల మెమోరీస్.. అభిమానులకు కూడా స్పెషల్ గానే అనిపిస్తాయి. ఎందుకంటే.. ఆయా సెలబ్రిటీలపై ఉండే అభిమానం అలాంటిది. కొత్తగా అప్ డేట్స్ తెలిసినా.. లేదా తెలియని విషయాలు తెలిసినా ఆ రోజంతా ఫ్యాన్స్ ఎంతో ఆనందంగా ఉంటారు. సెలబ్రిటీల ప్రొఫెషనల్ లైఫ్ నే కాదు.. వాళ్ళ పర్సనల్ లైఫ్ లోని చిన్న చిన్న విషయాలు కూడా సెలబ్రేట్ చేసుకుంటారు ఫ్యాన్స్. కొన్నిసార్లు అవి బర్త్ డేస్ అయ్యుండొచ్చు.. మరికొన్నిసార్లు సినిమా రిలీజ్ మూమెంట్స్, సినిమా సక్సెస్ మీట్స్ కూడా అయ్యుండొచ్చు. కానీ.. వీటన్నింటికంటే అందరికి స్పెషల్ గా అనిపించేవి.. చిన్ననాటి జ్ఞాపకాలు.
అవును.. సెలబ్రిటీలైనా.. మామూలు జనాలైనా ఎవరి లైఫ్ లో వాళ్లకు బాల్యం, బాల్యంలోని గుర్తులు.. వయసు పెరిగినకొద్దీ మర్చిపోలేని జ్ఞాపకాలుగా మిలిగిపోతుంటాయి. అలాంటి జ్ఞాపకాలలో చిన్నతనంలో దిగిన ఫోటోలు కూడా భాగమే. ఆ ఫోటోలలో మనల్ని మనం చూసుకున్నా.. ఒకసారి అలా మన బాల్యంలోని గుర్తులన్నీ మైండ్ లో వాలిపోతుంటాయి. అయితే.. మన విషయం పక్కన పెడితే.. అభిమానించే సెలబ్రిటీల చిన్ననాటి ఫోటోలు కూడా ఫ్యాన్స్ కి కిక్కిస్తుంటాయి. ఇప్పుడు మనం పైన చూస్తున్న ఫోటో అలాంటిదే. ఆ ఫోటోలో ఉన్న సెలబ్రిటీ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. కొంచం దృష్టిపెడితే.. ఇట్టే పసిగట్టగలరు.
ఆ సెలబ్రిటీ ఎవరా? అని చెప్పుకునే ముందు.. ఆ సెలబ్రిటీ ఫాదర్ గురించి చెప్పుకోవాలి. ఆయన ఓ భాషలో సూపర్ స్టార్. తెలుగులో కూడా బ్లాక్ బస్టర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. ఆయన వారసుడిగా ఇప్పుడీ ఫోటోలో చూస్తున్న పిల్లాడు.. హీరోగా సినిమాలు చేస్తూ సక్సెస్ లలో ఉన్నాడు. ఇప్పుడైనా గుర్తుపట్టారా? ఆ సూపర్ స్టార్ ఎవరో కాదు.. మోహన్ లాల్. ఆ ఫోటోలో కనిపిస్తున్న బాలుడు మోహన్ లాల్ తనయుడు ప్రణవ్. మలయాళంలో సూపర్ హిట్స్ తో దూసుకుపోతున్న ప్రణవ్.. తండ్రి పేరుతో కాకుండా తనకంటూ స్పెషల్ ఇమేజ్ సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ మధ్య సౌత్ మొత్తాన్ని ఊపేసిన ‘దర్శన’ సాంగ్ ఇతనిదే. చిన్నప్పుడే చైల్డ్ ఆర్టిస్ట్ గా స్టేట్ ఫిలిం అవార్డు అందుకున్న ప్రణవ్.. హృదయం సినిమాతో హీరోగా డెబ్యూ చేశాడు. ప్రస్తుతం చేతిలో పలు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. మరి మోహన్ లాల్ తనయుడు ప్రణవ్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.