ఒక పక్క నట సింహం నందమూరి బాలకృష్ణ.. మరోపక్క మెగాస్టార్ చిరంజీవి.. ఈ ఇద్దరి మధ్యన ఒక చిన్నారి నిలుచుని ఉంది. మరి ఆ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా? ఇటీవల కాలంలో సెలబ్రిటీల చైల్డ్ హుడ్ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి. తాజాగా చిరు, బాలయ్యతో ఉన్న చిన్నారి ఫోటో ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతోంది. విడివిడిగా చిరంజీవి, బాలకృష్ణతో ఫోటో దిగడమే అదృష్టం అనుకుంటే.. ఈ బుడ్డది ఏకంగా ఇద్దరితో కలిసి మల్టీస్టారర్ ఫోటో దిగేసింది. ఆ విధంగా చిరు, బాలయ్యలను ఒక ఫ్రేమ్ లోకి తీసుకొచ్చింది. ఎవరబ్బా ఈ చిన్నారి అని సోషల్ మీడియాలో ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
అయితే ఆమె ఒక స్టార్ ప్రొడ్యూసర్ అశ్వనీ దత్ కూతురు ప్రియాంక దత్ అని అంటున్నారు. ప్రియాంక దత్ గురించి మనకి తెలిసిందే. సినిమాని వ్యాపారంగా కాకుండా.. వ్యాపకంగా భావించే గ్రేట్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ కూతురు ప్రియాంక దత్. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై ఎన్నో సూపర్ డూపర్ హిట్ చిత్రాలను అందించిన అశ్వనీదత్ వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని.. విలువలతో కూడిన చిత్రాలను నిర్మిస్తున్నారు. ఆమె కూడా తండ్రి బాటలోనే నిర్మాణ రంగంలో అడుగుపెట్టి సంచనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు. పవన్ కళ్యాణ్, చిరంజీవి, ఎన్టీఆర్ సినిమాలకి సహ నిర్మాతగా పని చేశారు. రవితేజ, నాని వంటి హీరోల సినిమాలకి నిర్మాతగా కూడా పని చేశారు. సినిమాల్లోకి రాక ముందు బాంబే దర్శకుడి దగ్గర అసిస్టెంట్ గా పని చేశారు. కొత్త వాళ్ళని ప్రోత్సహించేందుకు 2009లో ‘త్రీ ఏంజెల్స్ స్టూడియో’ పేరుతో ఒక నిర్మాణ సంస్థను స్థాపించారు.
నారా రోహిత్ నటించిన బాణం, నాని హీరోగా వచ్చిన ఎవడే సుబ్రమణ్యం, కీర్తి సురేష్ నటించిన మహానటి.. ఇలా మంచి సందేశాన్ని ఇచ్చే సినిమాలను నిర్మిస్తూ సినిమాల పట్ల తన అభిరుచిని, సమాజం పట్ల తన బాధ్యతను చూపించుకుంటూ వస్తున్నారు ప్రియాంక దత్. నటుడు, హాస్యనటుడు ప్రియదర్శి నటించిన ‘మెయిల్’ అనే అద్భుతమైన ఓటీటీ చిత్రాన్ని నిర్మించారు. నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి,రాహుల్ రామకృష్ణ, ఫరియా అబ్దుల్లా నటించిన జాతిరత్నాలు సినిమాకి సహ నిర్మాతగా కూడా వ్యవహరించారు ప్రియాంక దత్. బాలు, జై చిరంజీవ, శక్తి సినిమాలకి సహ నిర్మాతగా పని చేశారు. నవదీప్, కాజల్, నిఖిల్ నటించిన ఓం శాంతి, రవితేజ, కాజల్, రీచా గంగోపాధ్యాయ నటించిన సారొచ్చారు సినిమాలకు కూడా నిర్మాతగా వ్యవహరించారు.
ఎవడే సుబ్రమణ్యం, మహానటి, పిట్ట కథలు సినిమాలకి దర్శకత్వం వహించి.. ఇప్పుడు ప్రభాస్ తో పాన్ ఇండియా మూవీ చేస్తున్న నాగ్ అశ్విన్ కి సతీమణి అని తెలిసిందే. ప్రస్తుతం నాగ్ అశ్విన్.. ప్రభాస్ తో ప్రాజెక్ట్ కె సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇప్పుడు నిర్మాతగా సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న ప్రియాంక దత్.. చిన్నప్పుడు ఇలా బాలకృష్ణ, చిరంజీవిల పక్కన నిలబడి ఫోటో దిగారని ప్రచారం జరుగుతోంది. కానీ ఈ ఫోటోలో ఉన్న చిన్నారి ప్రియాంక దత్ కాదు. అయితే అప్పట్లో చిరు, బాలయ్య ఇలా కలిసి ఫోటో దిగడం మాత్రం ఇప్పుడు మెగా, నందమూరి ఫ్యాన్స్ ని బాగా ఆకట్టుకుంటుంది.ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది.