సాధారణంగా సినిమా షూటింగ్ లల్లో అప్పుడప్పుడు ప్రమాదాలు జరుతుంటాయి. ఇలాంటి ప్రమాదాల్లో కొన్ని ఎక్కువగా హీరోలే గాయపడుతుంటారు. ఎందుకంటే యాక్షన్ సీన్స్ తెరకెక్కిస్తున్న సమయంలో వారు ప్రమాదాలకు గురవుతుంటారు. అయితే తాజాగా అక్కినేని అఖిల్ హీరోగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఏజెంట్’ స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ‘ఏజెంట్’ మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ క్రమంలోనే యాక్షన్ సీన్ చిత్రీకరిస్తున్న సమయంలో డైరెక్టర్ సురేందర్ రెడ్డికి ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆయన కాలికి గాయం అయ్యింది. మరిన్ని వివరాల్లోకి వెళితే..
సురేందర్ రెడ్డి.. టాలీవుడ్ లో స్టైలిష్ దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కిక్, రేసుగుర్రం, ధృవ, సైరా నరసింహారెడ్డి లాంటి సూపర్ హిట్ చిత్రాలను సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ చిత్రాలతో టాలీవుడ్ స్టైలిష్ డైరెక్టర్ గా తన పేరును ఇండస్ట్రీలో లిఖించుకున్నాడు. ప్రస్తుతం అక్కినేని అఖిల్ హీరోగా ‘ఏజెంట్’ అనే భారీ యాక్షన్ థ్రిల్లర్ ను తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటోంది. ఈ క్రమంలోనే యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నప్పుడు డైరెక్టర్ సురేందర్ రెడ్డి గాయపడ్డాడు. దాంతో అతడిని ఆస్పత్రికి తరలించారు. అతడి ఎడమ కాలికి గయం కావడంతో చికిత్స తీసుకుని మళ్లీ సెట్లోకి వచ్చాడు. గాయం కొద్దిపాటిదే కావడంతో చిత్ర బృందం ఊపిరి పీల్చుకున్నారు.
ప్రస్తుతం సురేందర్ రెడ్డి వీల్ ఛైర్ లో ఉండి షూటింగ్ చేస్తున్న పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఇప్పటికే విడులైన ఏజెంట్ ట్రైలర్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్రంలో అఖిల్ కు జోడిగా సాక్షి వైద్య నటిస్తుండగా.. మలయాల సూపర్ స్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తున్నాడు. సైరా లాంటి హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో చిత్రం తర్వాత.. ఏజెంట్ లాంటి స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు డైరెక్టర్ సురేందర్ రెడ్డి. ఇక సంక్రాంతి బరిలోకే ఏజెంట్ రావాల్సి ఉండగా.. షూటింగ్ ఆలస్యం కావడంతో ఈ సినిమా సంక్రాంతి బరి నుంచి తప్పుకుంది.