ఈ మద్య సినీ ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. వెండితెర, బుల్లితెర నటులు, దర్శక, నిర్మాతలు ఇతర సాంకేతిక సిబ్బంది పలు కారణాలతో కన్నుమూస్తున్నారు. దీంతో ఇండస్ట్రీలో ఒక్కసారిగా విషాదఛాయలు నెలకొంటున్నాయి. సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది.. ప్రముఖ దర్శకులు మణి నాగరాజ్ కన్నుమూశారు.
ప్రముఖ దర్శకుడు మణి నాగరాజ్ కి చెన్నైలోని ఆయన నివాసంలో అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో అకాల మరణం పొందారు. కెరీర్ బిగినింగ్ లో ఆయన ప్రముఖ దర్శకులు గౌతమ్ మీనన్ వద్ద పనిచేశారు. గౌతమ్ మీనన్ తెరకెక్కించిన కాక్క కాక్క చిత్రానికి ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. ఆ తర్వాత జీవి ప్రకాశ్ కుమార్, శ్రీ దివ్య నటించిన పెన్సిల్ చిత్రానికి దర్శకుడిగా పరిచయం అయ్యారు.
మణి కుమార్ దర్శకత్వం లో వాసువిన్ కర్పైణెగన్ అనే మూవీకి రాబోతుంది. ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. ఇంతలోనే ఈ విషాదం జరగడంతో ఇండస్ట్రీలో ఒక్కసారే విషాదఛాయలు నెలకొన్నాయి. ఎంతో మంచి భవిష్యత్ ఉన్న దర్శకుడు ఇలా అకాల మరణం పొందడం సినీ ప్రేమికులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన మృతి పై పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
Shocked & saddened to know about the passing away of film-director Mani Nagaraj, former associate of Gautham Vasudev Menon. He’s the one who taught me the basics of post-production. A good friend & a great teacher gone too soon. Rest in Peace, Mani Ji. You will be missed. 💔🕯️🌹
— T.S.Suresh (@editorsuresh) August 25, 2022