టాలీవుడ్ స్టార్ హీరో నితిన్ కొత్త సినిమా ‘మాచర్ల నియోజకవర్గం’ మంచి టాక్ తో దూసుకుపోతోంది. ఈ సినిమాతో ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి డైరెక్టర్ గా పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. ఈ డైరెక్టర్ పేరిట ఓ ఫేక్ ట్వీట్ ఒకటి సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది. దీంతో తనపై తప్పుడు ప్రచారం సాగుతోందని, దీనిపై చర్యలు తీసుకోవాలని సినీ దర్శకుడు ఎం.ఎస్.రాజశేఖర్ రెడ్డి పోలీసులను ఆశ్రయించాడు. వివరాల్లోకి వెళితే..
ఎం.ఎస్.రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో నితిన్ హీరోగా ‘మాచర్ల నియోజకవర్గం’ మూవీ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా… సినిమా ఆగస్టు 12న విడుదల కానుంది. డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి కొన్ని సామాజిక వర్గాలను కించపరిచినట్లు ప్రచారం మాత్రమే కాదు.. జాగ్రత్తగా ఉండాలని స్వయంగా హీరో నితిన్ పోస్ట్ చేసినట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీనిపై నితిన్ పూర్తి క్లారిటీ ఇచ్చాడు.. కానీ ట్విట్లు మాత్రం ఇంకా చక్కర్లు కొడుతున్నాయి.
తమ సినిమా రిలీజ్ ముందు ఇంటి గందరగోళం సృష్టిస్తున్నారని.. చిత్ర దర్శకుడు రాజశేఖర్ రెడ్డి, నిర్మాత సుధాకర్ రెడ్డి హైదరాబాద్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ట్వీట్ చేసిన అకౌంట్ తనది కాదని, ట్వీట్‌లో ఉన్న విషయాలను స్క్రీన్ షాట్స్ తీసి పోలీసులకు అందించారు. తనపై జరుగుతున్న దుష్ప్రచారానికి అడ్డుకట్ట వేయడంతో పాటు నిందితులను కఠినంగా శిక్షించాలంటూ ఆయన పోలీసులను కోరారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఫేక్ ట్వీట్‌లకు పాల్పడిన నిందితుడు ఎవరనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.
నితిన్ హీరోగా నటిస్తూ.. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌లో ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమా తెరకెక్కుతోంది. క్యాథరిన్ , కృతి శెట్టి హీరోయిన్స్. అంజలి స్పెషల్ సాంగ్‌లో నటించింది. ఈ మూవీలో సముద్ర ఖని కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తలియజేయండి.