సినిమా బాగుందా బాగోలేదా అనేది ప్రేక్షకులకు ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు. దాన్ని చూడాలా వద్దా అనేది వాళ్లే నిర్ణయం తీసుకుంటారు. డైరెక్టర్, హీరో, ప్రొడ్యూసర్స్.. ఎవరెంత మాయ చేసినా సరే ఆడియెన్స్ థియేటర్లకు రారు. ఒకవేళ కంటెంట్ బలంగా ఉంటే మాత్రం.. ప్రేక్షకులకు చెప్పకపోయినా సరే సినిమాని హిట్ చేస్తారు. నలుగురికి బాగుందని చెబుతారు. ఇక టెక్నాలజీ, ఓటీటీ వినియోగం బాగా పెరిగిపోయిన ప్రస్తుత కాలంలో సినిమా రిలీజ్ కావడమే లేటు రిజల్ట్ ఏంటనేది ఇట్టే తెలిసిపోతోంది. సదరు సినిమాని విశ్లేషించేవారు కూడా బాగా ఎక్కువైపోయారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్న వారిలో డైరెక్టర్ గీతాకృష్ణ ఒకరు. ఈయన అప్పుడెప్పుడో సంకీర్తన, కీచురాళ్లు, కోకిల లాంటి సినిమాలు తీశారు. ప్రస్తుతం మాత్రం సినిమా ఇండస్ట్రీ గురించి వాళ్లగురించి వీళ్లు గురించి మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ఆయన ‘ఊర్వశివో రాక్షసివో’ సినిమాపై షాకింగ్ కామెంట్స్ చేశారు. హిట్ కానీ సినిమాకు సక్సెస్ మీట్ పెట్టడం ఏంటని అభిప్రాయపడ్డాడు. అల్లు అర్జున్ ని పొగడటానికి డబ్బులిచ్చి జనాలని తెచ్చుకున్నారని డబ్బా కొట్టుకుంటున్నారా అని కౌంటర్లు వేశాడు.
‘సినిమా హిట్ కాకపోయినా సరే హిట్ అయిందని పబ్లిసిటీ చేసుకుంటూ డబ్బులిచ్చి జనాలతో పొగిడించుకోవడం వల్ల జనాల్లో సినిమా హిట్ అనే భావన తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. కానీ అసలు ఆ సినిమాని కానీ సక్సెస్ మీట్ ని కానీ వీటిని పట్టించుకునే తీరికలో ప్రస్తుతం జనాలు లేరు. వాళ్లకు నచ్చితే సినిమా ఎవరదని కూడా చూడకుండా హిట్ చేస్తారు. లేదంటే అది ఎంత పెద్ద హీరో సినిమా అయినా సరే ఫ్లాప్ చేస్తారు’ అని గీతాకృష్ణ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఇదిలా ఉండగా రీసెంట్ గా థియేటర్లలోకి వచ్చిన ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్.. యూత్ ని అలరిస్తోంది.