ఇండస్ట్రీలో ఇన్నేళ్ళపాటు తమిళ, తెలుగు, హిందీ సినిమాల వరకే పరిమితమైన సౌత్ ఇండియన్ స్టార్ హీరో ధనుష్.. తాజాగా హాలీవుడ్ లో సైతం డెబ్యూ చేయనున్న సంగతి తెలిసిందే. ధనుష్ నటించిన మొదటి హాలీవుడ్ చిత్రం ‘ది గ్రే మ్యాన్’.. జూలై 22 నుండి దిగ్గజ ఓటిటి ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు హాలీవుడ్ డైరెక్టర్స్ రూసో బ్రదర్స్(జో రూసో – ఆంటోనీ రూసో) దర్శకత్వం వహించారు.
ఇక తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా, ధనుష్ తో కలిసి సినిమా చూసేందుకు దర్శకులు రూసో బ్రదర్స్ ఇండియా వచ్చారు. ఈ క్రమంలో ఇద్దరు హాలీవుడ్ డైరెక్టర్లు మొదటిసారి ఇండియాకి రావడంతో వారిని తమ ఇంటికి ఆహ్వానించి, మాంచి ఆతిథ్యం అందించాడు బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమీర్ ఖాన్. అయితే.. ఆమిర్ ఏర్పాటు చేసిన ఈ స్పెషల్ డిన్నర్ లో అతని మాజీ భార్య కిరణ్ రావు కూడా పాల్గొనడం విశేషం.
ఈ పార్టీలో హీరో ధనుష్, ఆమీర్, కిరణ్ రావు, రూసో బ్రదర్స్ అంతా కలిసి సందడి చేశారు. అయితే.. ఇప్పటికే అమీర్ – కిరణ్ రావు విడాకులు తీసుకుని విడిపోయినప్పటికీ, స్నేహితులుగా ఎప్పుడూ కలిసే ఉంటామని చెప్పారు. ఇప్పుడు వీరిద్దరూ కలిసిన తీరు చూస్తుంటే.. చెప్పిన మాటలకు కట్టుబడి స్నేహితులుగా కలిసే ఉన్నారని అర్థమవుతోంది. ఇక ఈ విందులో కొత్త గెస్టులకు గుజరాతి వంటకాలు రుచి చూపించారట ఈ మాజీ దంపతులు. ప్రస్తుతం ఈ పార్టీకి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఈ పిక్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.