షారుక్ ఖాన్ బాలీవుడ్ బాద్‌షా అని మరోసారి రుజువు చేసుకున్నాడు. షారుక్ నుంచి నాలుగేళ్ల తర్వాత వచ్చిన పఠాన్ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. బాక్సాఫీస్ వద్ద పఠాన్ సినిమా వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. రోజుకో రికార్డు బద్దలు కొడుతూ దూసుకుపోతున్నారు. నిజానికి పఠాన్ మూవీ ఒక్క షారుక్ ఖాన్ లో మాత్రమే ఆశలు పెంచలేదు.. యావత్ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆశలు చిగురింపజేసింది. బాలీవుడ్ నుంచి కొన్నేళ్లుగా సరైన హిట్టు రాలేదు. ఇప్పుడు ఆ వెలితిని ఈ పఠాన్ సినిమా తీర్చేసింది. అసలు ఈ సినిమా విడుదలైన 5 రోజ్లుల్లో ఎన్ని కోట్లు కొల్లగొట్టిందో చూద్దాం.
పఠాన్ సినిమా విడుదల సమయం నుంచి రికార్డులు బద్దలు కొడుతూనే ఉంది. వీకెండ్ కి రెండ్రోజుల ముందు ఈ సినిమాని విడుదలచేసి చిత్రబృందం చాలా తెలివిగా వ్యవహరించింది. జనవరి 25 నుంచి ఆదివారం వరకు.. పఠాన్ సినిమా తొలి 5 రోజుల్లో 500 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి సత్తా చాటింది. ఐదురోజుల్లో భారతదేశంలో 275 కోట్లు కలెక్ట్ చేసింది. వరల్డ్ వైడ్ గా 5 రోజుల్లో రూ.500 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ కలెక్షన్స్ చూసి చిత్రబృందం, షారుక్ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. మొత్తం బాలీవుడ్ అంతా సంబరాలు చేసుకుంటోంది. ఇదీ హిందీ సినిమా సత్తా అంటూ కామెంట్లు చేస్తున్నారు.
#Pathaan *early estimates* Sun [Day 5]: ₹ 60 cr to ₹ 62 cr. #Hindi version. 🔥🔥🔥
Note: Final total could be marginally higher/lower.— taran adarsh (@taran_adarsh) January 29, 2023
బాలీవుడ్ పనైపోయింది అని విమర్శిస్తున్న తరుణంలో పఠాన్ సినిమాతో షారుక్ ఖాన్ సరైన బ్లాక్ బస్టర్ నమోదు చేశాడు. ఇంక పఠాన్ రికార్డుల విషయానికి వస్తే.. ఈ సినిమాపై బజ్ ఏర్పడటంతో ఓపెనింగ్స్ బాగా లభించాయి. తర్వాత సినిమాకి మంచి టాక్ రావడంతో కలెక్షన్స్ సునామి ఏర్పడింది. హిందీ సినిమాకి సంబంధించి పఠాన్ సినిమా దాదాపు అన్ని రికార్డులను కొల్లగొట్టింది. మొదటిరోజు రూ.106 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి చరిత్రలో ఉన్న హిందీ సినిమాల డే1 రికార్డులను తుడిచిపెట్టేసింది. డే2లో 70 కోట్లు కలెక్ట్ చేసిన ఏకైక హిందీ సినిమాగా నిలిచింది.
‘PATHAAN’ NEW MILESTONE: FASTEST
TO HIT ₹ 250 CR… AGAIN OVERTAKES ‘KGF2’, ‘BAAHUBALI 2’, ‘DANGAL’…
⭐️ #Pathaan: Will cross ₹ 250 cr today [Day 5]
⭐️ #KGF2 #Hindi: Day 7
⭐️ #Baahubali2 #Hindi: Day 8
⭐️ #Dangal: Day 10
⭐️ #Sanju: Day 10
⭐️ #TigerZindaHai: Day 10#India biz. pic.twitter.com/DFsXcptErD— taran adarsh (@taran_adarsh) January 29, 2023
అత్యంత వేగంగా రూ.200 కోట్ల క్లబ్ లో చేరిన హిందీ సినిమాగా కేజీఎఫ్ 2, బాహుబలి 2 రికార్డులను బద్దలు కొట్టింది. ఇంక అత్యంత వేగంగా రూ.300 కోట్ల క్లబ్, రూ.400 కోట్లు, రూ.500 కోట్ల క్లబ్ లో చేరిన హిందీ సినిమాగా పఠాన్ రికార్డులు సృష్టించింది. ఒక్క భారతదేశంలో మాత్రమే కాదు.. విదేశాల్లో కూడా పఠాన్ సినిమా కలెక్షన్స్ ఏ మాత్రం తగ్గుదల కనిపించడం లేదు. ఇప్పటికీ హౌస్ ఫుల్ బోర్డులతో థియేటర్లు నడుస్తున్నాయి. పఠాన్ సినిమా జోరు చూస్తుంటే కచ్చితంగా రూ.1000 కోట్ల క్లబ్ లో చేరుతుందని ట్రేడ్ పండితులు అంచనాలు వేస్తున్నారు. అదే నిజమైతే బాలీవుడ్ ఇండస్ట్రీలో కొత్త ఆశలు చిగురించినట్లే అంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.
Pathaan collection is on fire 🔥
First 5 days extended weekend creates new records.
-All India collection 275 crore+
-Worldwide collection 500 crore+#Pathaan #Pathan #PathaanMovie #pathaanboxoffice #PathaanCollection #PathaanTrailer #ShahRukhKhan #SRKians #SRK #SRKUniverse pic.twitter.com/JB1XXkxUz9— Prashant Jain / प्रशांत जैन (@IamPrashantJain) January 30, 2023