ఆ పోస్టుపై స్పందిస్తున్న నెటిజన్లు రాజాను తిట్టిపోస్తున్నారు. తేజును కాకుండా దీపికను ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావని ప్రశ్నిస్తున్నారు. తేజును రాజా మోసం చేశాడంటూ మండిపడుతున్నారు.
సినిమా వేరు.. నిజ జీవితం వేరు. సినిమాలో ఎంతో దాన గుణంతో ప్రవర్తించే వ్యక్తి.. నిజ జీవితంలో పిల్లికి కూడా బిచ్చం పెట్టకపోవచ్చు. సినిమాలో హీరోలా అందరినీ కాపాడే వ్యక్తి. నిజ జీవితంలో పిరికి వాడై ఉండొచ్చు. ముఖ్యంగా సినిమాలో హీరో, హీరోయిన్‌ల మధ్య చూపించిన బాండింగ్ నిజజీవితంలో ఉండకపోవచ్చు. సినిమాలో భార్యాభర్తలుగా ఉన్నవారు నిజ జీవితంలో అసలు ఫ్రెండ్స్ కూడా కాకపోవచ్చు. ఇదే సీరియల్స్ విషయంలోనూ వర్తిస్తుంది. అయితే, హిట్ అయిన ఓ జంటను బయట వేరుగా చూడటం కొంతమంది ఫ్యాన్స్‌కు నచ్చదు. అందుకే వారు నిజజీవితంలో వేరే పెళ్లి చేసుకుంటే అస్సలు తట్టుకోలేరు.
ఒకప్పుడయితే సోషల్ మీడియా లేదు కాబట్టి ఎలాంటి గొడవ చేసేవారు కాదు. కానీ, ఇప్పుడు సోషల్ మీడియా బాగా పెరిగిపోయింది. ఇప్పుడు ఏదైనా ఉంటే ట్రోల్స్ చేసేస్తున్నారు. తాజాగా, ఓ తమిళ నటుడిపై కొందరు నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. సీరియల్‌లో అతడితో పాటు నటించిన ఆమెను కాకుండా వేరే ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకోవటమే ఇందుకు కారణం. పూర్తి వివరాల్లోకి వెళితే.. తమిళ సీరియల్ నటుడు రాజా, నటి తేజు వెంకటేష్ కలిసి ఓ సీరియల్‌లో నటిస్తున్నారు. తాజాగా, రాజాకు ‘కనా కన్నుము్ కాలంగల్’ సీరియల్ నటి దీపికతో నిశ్చితార్థం అయింది. ఈ విషయాన్ని రాజా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించాడు. తనకు దీపికతో ఎంగేజ్‌మెంట్ అయిందని పేర్కొన్నాడు. ఈ పోస్టు కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆ పోస్టుపై స్పందిస్తున్న నెటిజన్లు రాజాను తిట్టిపోస్తున్నారు. తేజును కాకుండా దీపికను ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావని ప్రశ్నిస్తున్నారు. తేజును రాజా మోసం చేశాడంటూ మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ వార్తలపై తేజు వెంకటేష్ స్పందించారు. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ స్టోరీ పెట్టారు. సీరియల్ వేరు, నిజ జీవితం వేరని పేర్కొన్నారు. వారు పెళ్లి చేసుకోవటం తనకు ఎంతో సంతోషాన్ని ఇస్తోందని అన్నారు. వారి ప్రైవసీని గౌరవించాలని కోరింది. మరి, నటీ, నటుల పెళ్లిపై నెటిజన్లు రాద్దాంతం చేయటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.