ఆమె సినిమా చేస్తే సమ్ థింగ్ డిఫరెంట్ ఉంటుంది. కాన్సెప్ట్ వరకు మాత్రమే కాదు యాక్టింగ్ కూడా చాలా నేచురల్ గా ఉంటుంది. అందుకే ఆమెని అభిమానించే ఫ్యాన్స్ కోట్లల్లో ఉంటారు. దక్షిణాదిలో పుట్టినప్పటికీ.. ప్రస్తుతం బాలీవుడ్ ని ఏలుతోంది. అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటూ, మిగతా హీరోయిన్లకు అందనంత ఎత్తులో ఉంది. తనతో పాటు బ్లాక్ బస్టర్ సినిమాలు చేసిన సహ నటుడు, హీరోనే పెళ్లి చేసుకుంది. ఆమెనే దీపికా పదుకొణె. తాజాగా తన ఆరోగ్యం గురించి సంచలన విషయాలు బయటపెట్టింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. హీరోయిన్ గా దీపికా పదుకొణె గురించి వేలెత్తడానికి లేదు. ఎందుకంటే నటనలో తనకు తానే సాటి అని నిరూపించుకుంది. కెరీర్ పీక్ స్టేజీలో ఉన్న టైంలోనే.. తను డిప్రెషన్ సమస్యతో బాధపడుతున్నానని చెప్పి అందరికీ షాకిచ్చింది. ఇక అక్టోబరు 10న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా తమిళనాడులో ఓ కార్యక్రమంలో దీపికా పాల్గొంది. ఓ ఇంగ్లీష్ న్యూస్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన డిప్రెషన్ గురించి మరోసారి ఓపెన్ అయింది. మానసికంగా బలహీనంగా ఉన్నప్పుడు, మన ఫ్యామిలీ పాత్ర చాలా ముఖ్యమైనదని చెప్పింది. తన ప్రయాణంలో అమ్మ ఎప్పుడూ తోడుగా నిలిచిందని పేర్కొంది.
‘బెంగళూరులో ఉంటున్న టైంలో తల్లిదండ్రులు నా దగ్గర వచ్చినప్పుడు అంతా బాగానే ఉందని కవర్ చేసేదాన్ని. కానీ ఓ రోజు అమ్మ నన్ను నిలదీసింది. నీకు ఏదో సమస్య ఉన్నట్లు అనిపిస్తోంది. ‘ఏమైంది ఎందుకలా ఉన్నావ్’ అని అడిగింది. దీంతో నా పరిస్థితి ఏంటనేది మొత్తం చెప్పేశాను. ఆ సమయంలో అమ్మని ఆ దేవుడే పంపాడనిపించింది. అప్పుడు అమ్మ లేకపోయింటే ఏమై ఉండేదాన్నో ఏంటో?’ అని దీపికా చెప్పింది. ఇదిలా ఉండగా 2015లో తొలిసారి తన డిప్రెషన్ గురించి బయటపెట్టిన దీపిక.. ప్రస్తుతం ‘లివ్ లవ్ లాఫ్’ కమ్యూనిటీతో కలిసి మానసిక అనారోగ్యంతో పోరాడుతున్న వారికి సాయం చేస్తోంది. మరి దీపిక చెప్పిన విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.