'బలగం' సినిమా ద్వారా డైరెక్టర్ గా మారి భారీ విజయాన్ని అందుకున్నాడు కమెడియన్ వేణు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తాను జబర్దస్త్ వదిలేసి రావడానికి గల కారణాలను చెప్పుకొచ్చాడు వేణు.
జబర్దస్త్ ద్వారా ఎంతో మంది కమెడియన్లు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. వారిలో కొందరు ఇప్పుడు సినిమాల్లో కూడా రాణిస్తున్నారు. ఇక తాజాగా ‘బలగం’ సినిమా ద్వారా డైరెక్టర్ గా మారి భారీ విజయాన్ని అందుకున్నాడు కమెడియన్ వేణు. జబర్దస్త్ షోతో మంచి కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న వేణు.. తాజాగా దర్శకుడిగా సైతం విజయం సాధించాడు. అయితే కొన్ని కారణాల వల్ల జబర్దస్త్ నుంచి వేణు బయటకి వచ్చాడు. ఇక తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తాను జబర్దస్త్ వదిలేసి రావడానికి గల కారణాలను చెప్పుకొచ్చాడు వేణు. మరి ఏ కారణంతో జబర్దస్త్ నుంచి బయటకి వచ్చాడో ఇప్పుడు తెలుసుకుందాం.
‘బలగం’.. చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం సాధించిన మూవీ. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రొడక్షన్ హౌజ్ లో జబర్దస్త్ కమెడియన్ వేణు బలగం చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యాడు. తొలి చిత్రంతోనే ఘనవిజయం అందుకున్నాడు. కుటుంబ బంధాల విలువలపై ఈ చిత్రాన్ని చక్కగా తెరకెక్కించాడు. ఇక ఈ చిత్రం విజయం సాధించడంతో వరుసగా ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ వస్తున్నాడు వేణు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తాను జబర్దస్త్ నుంచి బయటకి రావడానికి గల కారణాలను వివరించాడు. అయితే వేణు జబర్దస్త్ నుంచి బయటకి రావడంతో.. విభేదాల కారణంగానే వేణు ఈ షో నుంచి బయటకు వచ్చినట్లు గతంలో వార్తలు వచ్చాయి.
ఇక ఇప్పటి వరకు దీనిపై క్లారిటీ ఇవ్వని వేణు తాజాగా స్పందించాడు. ఎందుకు జబర్దస్త్ నుంచి బయటకు వచ్చారు అన్న ప్రశ్న ఎదురైంది. దీనికి వేణు సమాధానం ఇస్తూ..”నేను జబర్దస్త్ నుంచి బయటకు రావడానికి విభేదాలు కారణం కాదు. ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు. నేను అక్కడి నుంచి బయటికి రావడానికి ప్రధాన కారణం సినిమాలు. ఫస్ట్ నుంచి నా లక్ష్యం సినిమానే. ఇక నేను నా జీవితాంతం సినిమాల్లోనే ఉండాలని వచ్చాను. అందుకోసంమే జబర్దస్త్ మానేశా” అని చెప్పుకొచ్చాడు వేణు. అదీకాక నేను జబర్దస్త్ నుంచి వచ్చే నాటికి షోకు మంచి రేటింగ్ వస్తోందని, పైగా మంచి రెమ్యూనరేషన్ కూడా ఇస్తున్నారని తెలిపాడు వేణు. కేవలం సినిమాలపై ఇష్టంతోనే ఆ షోను వదిలేశాను అని స్పష్టం చేశాడు వేణు. ఈ క్రమంలోనే తనకు సినిమాపై ఎలాంటి ప్రేమ ఉందో తన తొలి మూవీతోనే నిరూపించుకున్నాడు డైరెక్టర్ వేణు. ప్రస్తుతం బలగం సినిమా పాజిటీవ్ టాక్ తో థియేటర్లలో సందడి చేస్తోంది.