ఆట, మాయాద్వీపం వంటి రియాలిటీ షోస్‌తో తెలుగు బుల్లితెరపై ఒక ట్రెండ్ సెట్ చేసిన ఓంకార్‌పై ఆట సందీప్ సతీమణి జ్యోతిరాజ్ సంచలన కామెంట్స్ చేశారు. ఓంకార్ షోల ద్వారా ఎంతోమంది ప్రతిభావంతులైన కొరియోగ్రాఫర్లు పరిచయమైన విషయం తెలిసిందే. అయితే వారు ఇప్పుడు ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో అనేది ఎవరికీ తెలియదు. ప్రస్తుతం వీళ్ళ గురించే జ్యోతిరాజ్ బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆమె ఓంకార్‌ను ఉద్దేశించి పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఎంత ప్రతిభ ఉన్నప్పటికీ ప్రస్తుతం అవకాశాలు లేక చాలా మంది కొరియోగ్రాఫర్లు దీనస్థితిలో ఉన్నారని, ఇలాంటి వారికి ఓంకార్ అవకాశాలు ఇవ్వచ్చు కదా అని జ్యోతిరాజ్ ప్రశ్నించారు. తాజాగా ఆట సందీప్, జ్యోతిరాజ్‌లు సాక్షి ఛానల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో భాగంగా ఓంకార్ పేరు ప్రస్తావించకుండా ఆయన మీద పరోక్ష విమర్శలు చేశారు.
మీరు పెద్ద సినిమాలు చేసినప్పుడు పెద్ద మాస్టర్స్‌నే ఎంకరేజ్ చేస్తున్నారని, మరి మీకు తమ్ముళ్ళు ఎందుకు గుర్తుకురారని ఆమె ప్రశ్నించారు. మీ తమ్ముళ్ళందరూ మీరు చెక్కిన శిల్పాలు కదా, మీరు చెక్కిన డైమండ్స్ కదా. మరి మీరు పెద్ద సినిమాలు చెసినప్పుడు మీ ఒక్కొక్క డైమండ్‌కి అవకాశం ఇవ్వచ్చు కదా అని అన్నారు. మీరు కూడా పెద్ద మాస్టర్స్ పబ్లిసిటీనే ఎందుకు వాడుకుంటున్నారని మండిపడ్డారు. మీ తమ్ముళ్ళని మీరే సపోర్ట్ చేయకపోతే, బయటి వాళ్లు ఎలా సపోర్ట్ చేస్తారని వ్యాఖ్యానించారు. తాను సందీప్‌ను ఉద్దేశించి మాట్లాడడం లేదని, సందీప్ సేఫ్ జోన్‌లోనే ఉన్నాడని ఆమె అన్నారు. ఒకప్పుడు ఆటలో చేసిన ఒక్క కొరియోగ్రాఫర్‌కైనా ఇప్పుడు లైఫ్ ఉందా అని ఆమె ప్రశ్నించారు. ఎంతోమంది బయట అవకాశాలు లేక, ఈవెంట్స్ లేక ఇబ్బందులు పడుతున్నారని, వాళ్ళంతా ఒక పొజిషన్‌కి వెళ్ళి కింద పడిపోయారని అన్నారు. వీళ్ళలో ఎవరైనా బయట కనిపించినప్పుడు చాలా బాధగా ఉంటుందని ఆమె అన్నారు. ఒకప్పుడు వీళ్లందరూ ఎంత మంచి డ్యాన్సర్లో అనిపిస్తుందని అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి ఓంకార్‌పై జ్యోతిరాజ్ చేసిన ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయమేంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Vishal: వీడియో: టీజర్ లాంచ్‌లో నటుడిపై చెయ్యి చేసుకున్న విశాల్!
ఇది కూడా చదవండి: Manchu Lakshmi: మంచు లక్ష్మి ఎమోషనల్ వీడియో! మాట్లాడుతూనే ఏడ్చేసింది!