నా భార్య దగ్గరుండి నా ప్రియురాలితో రొమాన్స్ చేయించింది. ఇంతే కాదు ఏకంగా.. లిప్ లాక్ పెట్టించింది. దీనికి సందీప్ భార్య స్పందిస్తూ.. అవును.. ఇట్స్ ఎమోషన్, దగ్గరుండి సపోర్ట్ చేశాను అంటూ జ్యోతిరాజ్ చెప్పుకొచ్చింది.
ఆట సందీప్.. ఓ డ్యాన్సర్ గా, కొరియోగ్రాఫర్ గా అందరికీ సుపరిచితులు. సినిమా ఈవెంట్లు, ప్రి రిలీజ్ ఈవెంట్ల వేదికలపై తన టీమ్ తో కలిసి డ్యాన్స్ తో దుమ్ముదులుపుతాడు. ఇదే కాకుండా, అప్పుడప్పుడు తన భార్యతో కలిసి అదిరిపోయే స్టేప్పులు వేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియోలో అప్ లోడ్ చేశారు. ఈ వీడియో తెగ వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే.. ఆట సందీప్ అతని భార్య ముందే తన ప్రియురాలితో కలిసి రొమాన్స్ లో రెచ్చిపోయాడు. ఆమె దగ్గరుండి మరీ లిప్ లాక్ లు పెట్టించిందని ఆట సందీప్ బహిరంగంగా చెప్పాడు. దీనికి ఆమె కూడా స్పందిస్తూ అవును.. నేను నా భర్తకు చాలా సపోర్ట్ చేశానంటూ చెప్పుకొచ్చారు. అసలు విషయం ఏంటంటే?
ఆట సందీప్, ఆయన భార్య జ్యోతిరాజ్ కలిసి నటించిన చిత్రం ‘లవ్యూ టూ’. ఇందులో కూడా వీళ్లిద్దరూ భార్యాభర్తలుగానే నటించినట్లు తెలుస్తుంది. సినిమా కథ విషయానికొస్తే.. పెళ్లైన ఓ డ్యాన్స్ మాస్టార్ మరో యువతితో ప్రేమలో పడడం, ఆ తర్వాత జరిగే పరిణామాల మధ్య ఈ సినిమా సాగుతూ ఉంటుంది. ఇదిలా ఉంటే, ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ లాంచ్ ఇటీవలే జరిగింది. ఈ సందర్భంగా ఆట సందీప్ మాట్లాడుతూ.. నా భార్య జ్యోతిరాజ్ చాలా మంచిది. ఈ మూవీలో నాకు చాలా సపోర్ట్ గా నిలిచింది.
మరీ ముఖ్యంగా రొమాన్స్ సన్నివేశాల్లో మాత్రం.. నా భార్య దగ్గరుండి లిప్ లాక్ పెట్టించిందని అన్నారు. ఇక పక్కనే ఉన్న ఆట సందీప్ భార్య జ్యోతిరాజ్ మైక్ అందుకుని.. ఈ మూవీ డైరెక్టర్ గారు ఓ సీన్ చెప్పారు. ఆమె ఆస్పత్రిలో ఉండగా కిస్ చేయాలని సీన్ చెప్పాడు. మా ఆయన వెంటనే ముద్దులు ఇచ్చాడు. ఇట్స్ ఎమోషన్ అంటూ దగ్గరుండి సపోర్ట్ చేశాను అంటూ జ్యోతిరాజ్ చెప్పుకొచ్చింది. ఇక పెళ్లైన మగాడు మరో యువతితో లవ్ ఎఫైర్ కొనసాగించొచ్చా అని భర్త సందీప్ అడిగింది జ్యోతిరాజ్. దీనికి సందీప్ సమాధానమిస్తూ.. పెళ్లైన తర్వాత లవ్ చేయకూడదనేం లేదు, ఎవరినైనా చేయచ్చు కానీ, అది జెన్యూన్ గా ఉండాలి. నా మనసులో భారాన్ని దాచుకోలేను. నువ్వు నో అనవనే ధైర్యం నాకు అంటూ సందీప్ చెప్పుకొచ్చాడు.