మెగాస్టార్ చిరంజీవి ఎంతోమందికి ఇన్స్పిరేషన్. హీరో అవ్వాలని ఇండస్ట్రీకి రావాలనుకునే ఎంతోమందికి ఆయనొక మార్గదర్శకుడు. చిరంజీవి ఇన్స్పిరేషన్ తో ఎంతోమంది ఇండస్ట్రీకి వచ్చి స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు. అలా కష్టపడి కింద నుంచి పైకొచ్చిన హీరోల్లో మాస్ మహారాజా రవితేజ ఒకరు. ఒకప్పుడు చిరంజీవి సినిమా టికెట్ల కోసం థియేటర్ల దగ్గర క్యూ లైన్ లో నిలబడి, చొక్కాలు చింపుకున్న రవితేజ.. హీరో అవ్వాలన్న ఆశతో ఇండస్ట్రీకి వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరి.. చిన్న చిన్న అవకాశాలు వస్తే చేశారు. స్టార్ హీరోల సినిమాల్లో సైడ్ క్యారెక్టర్లు చేసి.. ఇవాళ అదే హీరోల పక్కన స్టార్ హీరోగా నిలిచారు. ఒకప్పుడు మెగాస్టార్ అన్నయ్య సినిమాలో తమ్ముడిగా నటించిన రవితేజ.. అదే మెగాస్టార్ పక్కన పోటీ పడి మరీ నటించే స్థాయికి ఎదిగారు.
దీని వెనుక రవితేజ పడిన కష్టం అంతా ఇంతా కాదు. మెగాస్టార్ సినిమా రిలీజ్ అవుతుందంటే సినిమా థియేటర్ల దగ్గర కటౌట్లు కట్టే స్థాయి నుంచి.. చిరు పక్కన తన కటౌట్ కట్టించుకుని స్థాయికి వచ్చేశారు. అది మాస్ మహారాజా రవితేజ అంటే. అన్నయ్య తర్వాత రెండోసారి వాల్తేరు వీరయ్య సినిమాలో అన్నదమ్ముల్లా నటించిన చిరు, రవితేజలు.. నిజ జీవితంలో కూడా అన్నదమ్ముల్లానే ఉంటారు. ఇవాళ చిరు సినీ సోదరుడు రవితేజ పుట్టినరోజు. అందుకే రవితేజకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘నా తమ్ముడు రవితేజకి జన్మదిన శుభాకాంక్షలు. హాయిగా ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ, నిండు నూరేళ్లు సంతోషంగా ఉండేలా దీవించమని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను’ అంటూ ట్వీట్ చేశారు. మరి మనలోంచి వచ్చిన మాస్ మహారాజా రవితేజకి మీరు కూడా విషెస్ తెలియజేయండి.
నా తమ్ముడు రవితేజ @RaviTeja_offl కి జన్మదిన శుభాకాంక్షలు. హాయిగా ఎప్పుడు నవ్వుతూ, నవ్విస్తూ, నిండు నూరేళ్లు సంతోషంగా ఉండేలా దీవించమని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. pic.twitter.com/QmH0cAwg12
— Chiranjeevi Konidela (@KChiruTweets) January 26, 2023