ఇండస్ట్రీలో హీరోయిన్స్ గా రాణించాలంటే చేతినిండా అవకాశాలే కాదు.. ఆవగింజంత అదృష్టం కూడా కలిసి రావాలని అంటుంటారు. లేదంటే డెబ్యూ మూవీ నుండే సూపర్ సక్సెస్ లు ఎలా వస్తాయి అనేవారూ ఉంటారు. టాలీవుడ్ లో డెబ్యూ మూవీతో మంచి విజయాన్ని, యూత్ లో క్రేజ్ ని సంపాదించుకున్న ఓ బ్యూటీ.. ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. పైగా తన క్రేజ్ ని ఏకంగా పాన్ ఇండియా వైడ్ డెవలప్ చేసుకుంది.
సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ గా రాణించాలంటే చేతినిండా అవకాశాలే కాదు.. ఆవగింజంత అదృష్టం కూడా కలిసి రావాలని అంటుంటారు. లేదంటే డెబ్యూ మూవీ నుండే సూపర్ సక్సెస్ లు ఎలా వస్తాయి అనేవారూ ఉంటారు. వాళ్ళు వీళ్ళు అనుకునేది ఎంతవరకు నిజమో తెలియదు. కానీ.. టాలీవుడ్ లో డెబ్యూ మూవీతో మంచి విజయాన్ని, యూత్ లో క్రేజ్ ని సంపాదించుకున్న ఓ బ్యూటీ.. ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. పైగా వరుసగా స్టార్ హీరోల సరసన అవకాశాలను అందిపుచ్చుకుంటూ తన క్రేజ్ ని ఏకంగా పాన్ ఇండియా వైడ్ డెవలప్ చేసుకుంది. ఏంటి.. పాన్ ఇండియా రేంజా అని అనిపించవచ్చు.
ఆమె పేరు తెలిస్తే మాత్రం ఖచ్చితంగా అవును అనకుండా ఉండలేరు. ఇంతకీ పైన పిక్ లో కనిపిస్తున్న పాప ఎవరో గుర్తుపట్టారా? చిన్నప్పటి నుండే డ్యాన్స్ ప్రాక్టీస్ అదరగొట్టి.. ఇప్పుడు సౌత్ తో పాటు బాలీవుడ్ హీరోల సరసన కూడా అదిరిపోయే స్టెప్పులు వేస్తోంది. ఇంకా తెలియలేదా.. అయితే చెప్పేస్తా. ఆ పాప ఎవరో కాదు.. ఇండస్ట్రీలో నేషనల్ క్రష్ గా పేరొందిన కన్నడ భామ. అదేంటీ.. మాకు తెలిసి నేషనల్ క్రష్ అంటే.. క్రికెటర్ స్మ్రితీ మందాన కదా! అనుకోవచ్చు. కానీ.. ఆ బ్యూటీ స్పోర్ట్స్ పరంగా.. ఇప్పుడు మనం చూస్తున్న బ్యూటీ సినిమాల పరంగా. ఇంతదాకా వచ్చాక చెప్పకపోతే ఎలా.. అవును.. ఈ భామ రష్మిక మందాననే.
రష్మిక ప్రస్తుతం స్టార్డమ్ లో ఉన్న హీరోయిన్.. చిన్న సినిమాలతో కెరీర్ ప్రారంభించినా.. ఇప్పుడు పాన్ ఇండియా మూవీస్ తో రెచ్చిపోతోంది. అవును.. రెచ్చిపోవడమంటే నటన పరంగా ఏమోగానీ.. గ్లామర్ పరంగా అయితే నిజమే అంటున్నాయి సినీ వర్గాలు. ఎందుకంటే.. ఇటీవల కాలంలో రష్మిక షేర్ చేసిన సోషల్ మీడియా పోస్టులు చూస్తే ఇట్టే అర్థమవుతుంది. మొదట్లో క్లాస్ కట్టుబొట్టుతో అలరించిన ఈ భామ.. వరుస హిట్స్ పడి.. కెరీర్ పీక్స్ లోకి చేరుకునేసరికి ఒక్కసారిగా ప్లేట్ మార్చేసింది. ఎక్కడికి వెళ్లినా టాప్ టు బాటమ్ పరువాలను కెమెరా ముందు పరిచేస్తోంది. ప్రస్తుతం రష్మికకు సంబంధించి ఈ చైల్డ్ హుడ్ పిక్ వైరల్ గా మారింది. పుష్ప 2, యానిమల్ సినిమాల షూటింగ్స్ తో బిజీగా ఉన్న రష్మిక గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.