సాధారణంగా సినిమా హిట్ అయినా, ఫ్లాప్ అయినా సరే దర్శకుడిదే బాధ్యత. ఎందుకంటే ప్రతి విషయాన్ని దగ్గరుండి తనే చూసుకుంటాడు కాబట్టి. ఇక సినిమా హిట్ అయితే ప్రేక్షకుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రశంసలు దక్కుతాయి. ఒకవేళ ఫ్లాప్ అయితే మాత్రం తిప్పలు తప్పవు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ విమర్శిస్తారు. దీని వరకు ఓకే గానీ ఈ డైరెక్టర్ ని మాత్రం ఏకంగా బెదిరించారు. ‘ఆస్కార్’ నామినేషన్స్ నుంచి తప్పుకోవాలని వార్నింగ్స్ ఇచ్చారు. సదరు దర్శకుడే ఈ విషయాన్ని స్వయంగా బయటపెట్టాడు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఇది హాట్ టాపిక్ గా మారింది.
ఇక విషయానికొస్తే.. మన దేశం నుంచి విదేశీ చిత్రాల విభాగంలో ఆస్కార్ కు నామినేట్ అయిన సినిమా ‘ఛెల్లో షో’. పాన్ నళిన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా.. ఆస్కార్ కు సెలెక్ట్ కావడంతో ఒక్కసారిగా పాపులర్ అయింది. గుజరాత్ లోని ఓ మారుమూల గ్రామంలో జరిగే స్టోరీతో ఈ సినిమా తీశారు. గతేడాది ట్రిబెకా ఫిల్మ్ ఫెస్టివల్ లో స్పెషల్ స్క్రీనింగ్ కూడా వేశారు. స్పెయిన్ లో వల్లాడోలిడ్ చిత్రోత్సవంలోనూ గోల్డెన్ స్పైక్ పురస్కారంతో పాటు పలు అంతర్జాతీయ అవార్డులను ‘ఛెల్లో షో’ గెలుచుకుంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది భారత్ నుంచి ఆస్కార్ కు ఈ చిత్రం నామినేట్ కావడం పలువురిని ఆశ్చర్యపరిచింది.
అయితే తన సినిమా ఆస్కార్ కు నామినేట్ అయిన తర్వాత తనని కొందరు బెదిరించాలని, ఆస్కార్ రేస్ నుంచి ‘ఛెల్లో షో’ని తప్పించాలని సోషల్ మీడియా వేదికగా వార్నింగ్స్ కూడా ఇచ్చారని దర్శకుడు పాన్ నళిన్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఒకవేళ తప్పించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని తనని బెదిరించినట్లు పాన్ చెప్పుకొచ్చాడు. ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విషయాన్ని రివీల్ చేశాడు. ఇక సినిమాని ఆడియెన్స్, క్రిటిక్స్ ఆదరించిన తర్వాత ఆ విమర్శలు ఆగిపోయావని పాన్ నళిన్ చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉండగా ఆస్కార్ బరిలో పాన్ ఇండియా సినిమా ‘ఆర్ఆర్ఆర్’కు కూడా చోటు దక్కింది. బెస్ట్ సాంగ్స్ కేటగిరీలో ‘నాటు నాటు’ నిలిచింది. సరే ఇదంతా పక్కనబెడితే.. ఆస్కార్ బరిలో నిలిచిన డైరెక్టర్ ని బెదిరించడంపై మీ అభిప్రాయం ఏంటి? దిగువన కామెంట్స్ లో పోస్ట్ చేయండి.