సినీ ఇండస్ట్రీలో తారా జువ్వలా ఎగసిపడిన నటీమణులు అనూహ్యంగా కనుమరుగైపోయారు. తమ అందం.. అభినయం తో ప్రేక్షకుల మనసు దోచిన నటీమణులు అతి తక్కువ కాలంలోనే ఫెడవుట్ హీరోయిన్లుగా మారిపోయారు. తెలుగు, తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సరసన నటించిన అనతి కాలంలో ఇండస్ట్రీలో మార్క్ సంపాదించి.. అంతే వేగంగా కనుమరుగైన హీరోయిన్లలో ఒకరు బూరె బుగ్గల సుందరి చార్మి. తెలుగు ఇండస్ట్రీలోకి తక్కువ వయసులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన పంజాబీ బ్యూటీ ఛార్మీ దాదాపు అందరు స్టార్ హీరోలతో నటించింది. హీరోయిన్ గానే కాకుండా పలు చిత్రాల్లో ఐటమ్ సాంగ్స్ లో కూడా నటించింది.
ప్రస్తుతం నిర్మాతగా మారి స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తో కలిసి పలు చిత్రాలు నిర్మిస్తుంది. వీరిద్దరి కాంబినేషన్ లో రామ్ హీరోగా ఇస్మార్ట్ శంకర్ తో మంచి విజయాన్ని అందుకున్నప్పటికీ విజయ్ దేవరకొండతో పాన్ ఇండియా మూవీ లైగర్ తో భారీగా నష్టపోయిందని ఇండస్ట్రీ టాక్. ఛార్మీ చిన్నవయసులోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. బాలీవుడ్ లో జూనియర్ ఆర్టిస్ట్ గా ‘ముజ్ సే దోస్తీ కరోగి’ చిత్రంలో నటించింది. ఛార్మీ 15వ ఏటా తమిళంలో ‘కాదల్ అలివదిల్లయ్’, మలయళంలో చేసిన ‘ కట్టుచెంబాకమ్’ రెండు వరుస ఫ్లాపులు అందుకున్నాయి. దీంతో ఇక ఇండస్ట్రీలో తనకు ప్లేస్ ఉంటుందా లేదా అన్న సమయంలో తెలుగు లో ‘నీతోడు కావాలి’ చిత్రంలో ఛాన్స్ దక్కించుకుంది. ఆ చిత్రం కూడా పెద్దగా హిట్ కాలేదు.
క్రియేటీవ్ డైరెక్టర్ కృష్ణ వంశీ దర్శకత్వంలో నితిన్ హీరోగా నటించిన ‘శ్రీఆంజేనేయం’ చిత్రంతో గ్లామర్ పాత్రలో కనిపించి కుర్రాళ్లకు కిర్రెక్కించింది. ఆ తర్వాత ఛార్మీ కి స్టార్ హీరోల సరసన వరుస ఛాన్సులు వచ్చాయి. నాగార్జున మాస్ చిత్రం తర్వాత ఛార్మీకి ఒక్కసారే ఛాన్సులు తగ్గిపోయాయి. 2012 తర్వాత హీరోయిన్ గా ఛార్మీ కెరీర్ ముగిసిందనే చెప్పొచ్చు.. ఆ తర్వాత పలు చిత్రాల్లో ఐటమ్ సాంగ్స్ లో నటించింది. ఇండస్ట్రీకి కొద్ది కాలం దూరంగా ఉన్న ఛార్మీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.. అయితే నటిగా కాకుండా నిర్మాతగా కొత్త అవతారం ఎత్తింది. ప్రముఖ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ స్నేహం ఆమెను పూర్తిగా మార్చింది.
టాలీవుడ్ లో ఛార్మీ ప్రొడ్యూసర్ గా మారి పలు చిత్రాలు తీయడం మొదలు పెట్టింది. దాదాపు 2017 నుంచి ఛార్మీ తన నటనకు పూర్తిగా స్వస్తి చెప్పి.. నిర్మాణ రంగం వైపు దృష్టి పెట్టింది. అయితే ఇండస్ట్రీలో జరిగే మోసాలు, కుట్రలు.. కుతంత్రాలు, రాజకీయాలు అన్నింటిని తట్టుకొని ఆమె ముందుకు సాగింది. జ్యోతి లక్ష్మి మూవీ లో లీడ్ రోల్ లో నటించి నిర్మాతగా విజయం అందుకుంది. ఆ తర్వాత ఛార్మీ తీసిన చిత్రాలు వరుస ఫ్లాపులు అందుకున్నాయి. ఆ సమయంలోనే రామ్ పోతినేని హీరోగా నటించిన ఇస్మార్ట్ శంకర్ విజయంతో ఛార్మీకి కాస్త ఊరట లభించింది.
ఆ మద్య టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలో డ్రగ్స్ కేసు పెద్ద సంచలనం రేపింది. ఇందులో పలువురు సినీ, దర్శక, నిర్మాతలు ఉన్నట్టు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే టాలీవుడ్ కి చెందిన డైరెక్టర్ పూరి జగన్నాథ్, నటి ఛార్మీ తో పలు పలువురు నటులు ఈడీ ముందు హాజరయ్యారు. ఇండస్ట్రీలో ఛార్మీ వ్యక్తిగత జీవితంపై ఎన్నో విమర్శలు వెల్లువెత్తాయి. ఆమె పెళ్లి విషయంలో కూడా పలు రూమర్లను ఎదుర్కొంది ఛార్మీ. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ తో ప్రేమలో ఉందని.. త్వరలో వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నారని ఫిలిం వర్గాల్లో వార్తలు దుమారం రేపాయి. ఈ విషయంపై దేవీ శ్రీ, ఛార్మీ క్లారిటీ ఇవ్వడంతో ఈ వివాదానికి చెక్ పడింది.
ఈ వివాదం ముగిసిన తర్వాత పూరి జగన్నాథ్ తో ఆమె రిలేషన్ లో ఉంటున్నట్టు.. త్వరలో పూరి తన భార్యకు విడాకులు ఇచ్చి వీరిద్దరూ ఒకటి కాబోతున్నట్లు రక రకాల వార్తలు పుట్టుకొచ్చాయి. దీంతో ఛార్మీ మానసికంగా కృంగిపోయింది.. కానీ తాను ఏ తప్పూ చేయడం లేదని.. పూరితో కేవలం మంచి స్నేహ సంబంధం మాత్రంమే ఉందని క్లారిటీ ఇచ్చింది. తనపై విమర్శలు చేసిన వారికి ఘాటైన సమాధానం ఇచ్చింది. మొత్తానికి తమపై వచ్చిన పుకార్లను పూరి, ఛార్మి ఇద్దరూ కొట్టి పడేశారు.
పూరీ, ఛార్మీ కలిసి విజయ్ దేవరకొండ హీరోగా ‘లైగర్’ చిత్రాన్ని తెరకెక్కించారు. చిత్రం ఫ్లాప్ టాక్ రావడంతో ఛార్మీ భారీగా నష్టపోయిందని ఫిలిమ్ వర్గాల్లో టాక్ నడిచింది. ఏది ఏమైనా తనపై ఎన్ని విమర్శలు వచ్చినా.. జీవితంలో ఒక మగాడిగా పోరాడుతూ ముందుకు దూసుకు వెళ్తుంది ఛార్మీ. క్యూట్ స్మైల్ తో ఈ అమ్మడి చిన్ననాటి ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.