హిమాలయ స్టూడియో మేన్సన్స్ పతాకంపై సాయి రోనక్, నేహ సోలంకి హీరో హీరోయిన్లుగా సురేష్ శేఖర్ రేపల్లే దర్శకత్వంలో ఉదయ్ కిరణ్ నిర్మిస్తోన్న చిత్రం `ఛలో ప్రేమిద్దాం. ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెలలోనే విడుదలకు సిద్ధమవుతోంది.
ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను లాంచ్ చేశారు చిత్ర యూనిట్.1.17 నిమిషాల నిడివి గల టీజర్ తో ఇది ఒక లవ్ అండ్ సస్పెన్స్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రమని దర్శకుడు సురేష్ శేఖర్ చెప్పకనే చెప్పారు. డైరెక్టర్ టేకింగ్, సినిమాటోగ్రఫీ చాలా రిచ్‌గా ఉన్నాయి. భీమ్స్ అందించిన సంగీతం టీజర్‌కు అదనపు ఆకర్షణగా నిలిచింది. ఓవరాల్‌గా సినిమా యూత్‌తో పాటు అన్ని రకాల ఆడియెన్స్‌కి నచ్చేలా ఉండబోతోందని టీజర్ తో అర్థమైంది.