ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎక్కడ చూసిన ‘కాంతార’ మూవీ మ్యానియానే నడుస్తోంది. చిన్న సినిమాగా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి.. పాన్ ఇండియా చిత్రంగా మారింది కాంతార మూవీ. కన్నడ చిత్ర పరిశ్రమను కేజీఎఫ్ తరువాత దేశ స్థాయికి మరోసారి పరిచయం చేసిన సినిమా ఇదే. విడుదలై రోజులు గడుస్తున్న ఈ సినిమా కోసం థియేటర్ల వద్ద ప్రేక్షకులు క్యూ కడుతున్నారు. ఈ సినిమాతో కన్నడ హీరో రిషబ్ శెట్టి పాన్ ఇండియా స్టార్ గా మారారు. ఈ సినిమాపై పెద్ద సంఖ్యలో సినీ, రాజకీయ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు. మరికొందరు ప్రముఖులు అయితే ఈ సినిమాను థియేటర్లలో చూసి..సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తోన్నారు. తాజాగా కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా కాంతార మూవీని థియేటర్లలో వీక్షించారు. అంతేకాక ఆ సినిమా దర్శకుడు రిషబ్ శెట్టిని ప్రశంసించారు.
కాంతార మూవీ మొదట కన్నడలో విడుదలై.. అక్కడ ఘన విజయం సాధించింది. దీంతో తెలుగు తో పాటు మరికొన్ని ఇతర భాషల్లో కూడా సినిమా రిలీజ్ చేశారు. అనూహ్య విజయంతో ప్రాంతాలు, భాషలకు అతీతంగా భారీ వసూలు రాబట్టింది. ఈ సినిమాలో రిషబ్ శెట్టి నటనకు, సినిమా తెరకెక్కించిన విధానం అందరిని మెప్పించింది. ఒక్క తెలుగులోనే ఈ సినిమా ఏకంగా రూ. 50 కోట్లు రాబట్టింది అంటే కాంతార స్టామినా ఏంటో అర్థం అవుతుంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రికార్డులను తిరగరాస్తోంది. అత్యధిక కలెక్షన్లతో దుమ్మురేపుతోంది. ఇలా అన్ని భాషల్లో ఓ రేంజ్ లో కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఇలా కాంతార మూవీ వసూలకే పరిమితం కాకుండా విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంటుంది. దేశవ్యాప్తంగా ఉన్న పలువురు సెలబ్రిటీలు కాంతార చిత్రంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
సినీ పరిశ్రమతో పాటు రాజకీయ నాయకులు కూడా కాంతార మూవీని వీక్షిస్తూ చిత్ర యూనిట్‌ను ప్రశంసిస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి కేంద్ర ఆర్థిక శాఖమంత్రి నిర్మలా సీతారామన్ కూడా వచ్చి చేరారు. బుధవారం బెంగళూరులో కాంతార సినిమాను వీక్షించారు. ఆ విషయాన్ని ఆమె స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. కేంద్ర మంత్రి థియేటర్ లో సినిమాను వీక్షించిన ఫోటోలు ట్వీట్ చేస్తూ..’ వాలంటీర్లు, తన మిత్ర బృందంతో కలిసి బెంగళూరులో సినిమాను చూశాను. సినిమాలో బాగా నటించి, తెరకెక్కించిన రిషబ్ శెట్టికి అభినందనలు. తులువనాడు, కరావళి ప్రాంతంలోని సంప్రదాయాలకు ఈ మూవీ ప్రతీకగా నిలిచింది” అంటూ రాసుకొచ్చారు.
With a team of volunteers and well-wishers watched #KantaraMovie in Bengaluru.
Well made @shetty_rishab (writer/director/actor).👏
The film captures the rich traditions of Tuluvanadu and Karavali.@rajeshpadmar @SamirKagalkar @surnell @MODIfiedVikas @KiranKS @Shruthi_Thumbri pic.twitter.com/vVbbk5fNno
— Nirmala Sitharaman (@nsitharaman) November 2, 2022